వాహన రంగ సంక్షోభంలోనూ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మంచి స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సంస్థ లాభాలు 4.13 శాతం పెరిగాయి. 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి మారుతీ సుజుకీ రూ.1,587.4 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. ముడి సరుకుల ధరలు తగ్గడం, కార్పొరేట్ పన్ను తగ్గింపు, సంస్థ చేపట్టిన పొదుపు చర్యలే క్యూ3లో లాభాలకు ప్రధాన కారణం.
2018-19 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో మారుతీ సుజుకీ రూ.1,524.5 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ.20,721.8 కోట్లుగా నమోదైనట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ. 19,680.7 కోట్లుగా ఉంది.
అమ్మకాలు ఇలా..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో మారుతీ సుజుకీ 4,13,698 వాహనాలు విక్రయించింది. వీటిలో దేశీయ అమ్మకాలు 4,13,698 యూనిట్లు, ఎగుమతులు 23,663 యూనిట్లుగా ఉన్నాయి.