తెలంగాణ

telangana

ETV Bharat / business

దసరా వేళ కార్ల విక్రయాలు భళా

గత కొంత కాలంగా విక్రయాల్లో క్షీణత, లాక్​డౌన్​లో అమ్మకాలు పూర్తిగా నిలిచిపోవడం వంటి పరిణామలు ఎదుర్కొన్న వాహన రంగానికి దసరా నవరాత్రుల సీజన్​లో ఊరట లభించింది. నవరాత్రుల సమయంలో దేశీయంగా అన్ని కార్ల తయారీ సంస్థల రిటైల్​ విక్రయాలు భారీగా పెరిగినట్లు తెలిపాయి. కంపెనీల వారీగా విక్రయాల గణాంకాలు ఇలా ఉన్నాయి.

Auto sale Increased during Dussehra
పండుగ సీజన్​లో కార్ల విక్రయాలు అదుర్స్

By

Published : Nov 1, 2020, 2:34 PM IST

Updated : Nov 1, 2020, 3:14 PM IST

ఈ ఏడాది నవరాత్రుల సమయంలో కార్ల తయారీ సంస్థల పంట పండింది. దేశంలో ప్రధాన కార్ల తయారీ సంస్థలైన మారుతీ సుజుకీ, హ్యూందాయ్, టాటా మోటార్స్​ రిటైల్ అమ్మకాలు గత ఏదాది ఇదే సమయంతో పోలిస్తే భారీగా పెరిగాయి.

కియా మోటార్స్, టొయోటా కిర్లోస్కర్ మోటార్స్, మహీంద్రా&మహీంద్రా, హోండా కార్స్ ఇండియా.. విక్రయాలూ దసరాతో కలిపి 10 రోజుల్లో భారీగా పెరిగినట్లు ప్రకటించాయి.

నవరాత్రుల్లో కొత్త వస్తువులు, ఆస్తుల కొనుగోలును శుభపరిణామంగా పరిగణించే సెంటిమెంట్ విక్రయాల వృద్ధికి కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.

నవరాత్రి విక్రయాలు ఇలా..

  • ఈ ఏడాది నవరాత్రి సేల్స్​లో 96,700 యూనిట్లు విక్రయించినట్లు మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాత్సవ తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో మారుతీ సుజుకీ 76,600 యూనిట్లు అమ్మడం గమార్హం.
  • హ్యూందాయ్ కార్ల విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 28 శాతం పెరిగి 26,068 యూనిట్లుగా నమోదయ్యాయి.
  • రిటైల్ విక్రయాలు గత ఏడాది నవరాత్రి సమయంతో పోలిస్తే ఏకంగా 90 శాతం పెరిగి.. 10,887 యూనిట్లుగా నమోదయ్యాయని టాటా మోటార్స్ తెలిపింది.
  • నవరాత్రి సమయంలో కియా మోటార్స్ రిటైల్ విక్రయాలు 2019తో పోలిస్తే అత్యధికంగా 224 శాతం పెరిగాయి. మొత్తం 11,640 యూనిట్లు అమ్ముడయ్యాయి.
  • టొయోటా కిర్లోస్కర్ 5 వేల యూనిట్లు విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇవి 13 శాతం అధికం.
  • మహీంద్రా&మహీంద్రా ఎస్​యూవీల బుకింగ్స్​ గత ఏడాదితో పోలిస్తే 41 శాతం పుంజుకున్నాయి.
  • హోండా కార్స్ ఇండియా విక్రయాలు కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 10 శాతం పెరిగాయి.

ఇదీ చూడండి:ఎన్నికలు, మళ్లీ లాక్​డౌన్​ అంశాలే మార్కెట్లకు కీలకం!

Last Updated : Nov 1, 2020, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details