పండుగ సీజన్లో కార్లు, ఇతర ప్రయాణ వాహనాల విక్రయాలు భారీగా పెరిగాయి. మారుతీ సుజూకీ ఇండియా, హ్యుందాయ్ మోటర్స్ ఇండియాలు జోరు కనబరిచాయి. అక్టోబర్‌లో ఏకంగా రెండంకేల వృద్ధిని నమోదు చేశాయి. వాటితో పాటు హోండా కార్స్ ఇండియా, టొయోటా కిర్లోస్కర్ మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలు కూడా దేశీయ ప్రయాణ వాహనాల విక్రయాల్లో వృద్ధి నమోదు చేశాయి.
మారుతీ సుజూకీ..
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజూకీ ఇండియా (ఎంఎస్ఐ) 2019, అక్టోబర్(1,44,277 యూనిట్స్) తో పోలిస్తే.. ఈ ఏడాది అక్టోబర్‌లో 19.8 శాతం వృద్ధితో 1,72,862 వాహనాలు విక్రయించినట్లు ప్రకటించింది. అయితే.. సంస్థ చిన్న కార్లు ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటి విక్రయాల్లో స్వల్ప క్షీణత నమోదైంది. గత ఏడాది అక్టోబర్‌లో 28,537 యూనిట్లు విక్రయించగా.. ఈసారి 28,462 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
స్విఫ్ట్, సెలేరియో, ఇగ్నైస్, బలేనో, డిజైర్ వంటి కార్లు 19.2 శాతం వృద్ధితో 95,067 వాహనాలు అమ్ముడయ్యాయి. యుటిలిటీ వెహికిల్స్‌లో విటారా బ్రెజా, ఎస్-క్రాస్, ఎర్టిగాలు కూడా 9.9 శాతం వృద్ధితో 25,396 యూనిట్లు విక్రయమయ్యాయి.
హ్యుందాయ్ మోటర్స్..