తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫేస్​బుక్​ సీఈఓ మార్క్​కు రూ.54 వేల కోట్ల నష్టం - మార్క్​జుకర్​బర్గ్​ సంపద

'బాయ్​కాట్ ఫేస్​బుక్' పేరుతో.. కంపెనీలు ప్రకటనలు నిలిపివేస్తున్న నేపథ్యంలో సంస్థ సీఈఓ మా​ర్క్ జుకర్​బర్గ్ సంపద భారీగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల స్వల్ప కాలంలో ఆయన 7.2 బిలయన్​ డాలర్ల (రూ.54 వేలకోట్లు) సంపదను కోల్పోయినట్లు అంచనా.

Mark Zuckerberg net worth down
బాయ్​కాట్​ ఫేస్​బుక్ దెబ్బ

By

Published : Jun 27, 2020, 1:46 PM IST

ఫేస్​బుక్ అధినేత మార్క్​జుకర్​బర్గ్​ ఇటీవల 7.2 బిలియన్​ డాలర్ల (రూ.54 వేలకోట్లు) సంపదను కోల్పోయారు. ఫేస్​బుక్​లో ప్రకటనలు నిలిపివేయాలని కంపెనీలు తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు ప్రధాన కారణం.

యునిలీవర్​ దెబ్బ..

సామాజిక మాధ్యమాలకు ఈ ఏడాది చివరి నుంచి ప్రకటనలు నిలిపివేయనున్నట్లు ఎఫ్​ఎంసీజీ దిగ్గజం యునిలీవర్ తీసుకున్న నిర్ణయంతో ఫేస్​బుక్​ షేర్లు శుక్రవారం ఏకంగా 8.3 శాతం నష్టపోయాయి. గత మూడు నెలల్లో ఇంత భారీగా తగ్గడం ఇదే తొలిసారి. ఫేస్​బుక్​ మార్కెట్​ విలువలో ఈ నష్టం విలువ 56 బిలియన్ డాలర్లుగా అంచనా. యునిలీవర్​ సహా పలు ఇతర సంస్థలూ ఇలాంటి నిర్ణయాలే తీసుకోవడం వల్ల జుకర్​బర్గ్ సంపద మొత్తం 7.2 బిలియన్ డాలర్లు తగ్గి.. 82.3 బిలియన్​ డాలర్లకు చేరినట్లు బ్లూమ్​బర్గ్​ బిలియనీర్స్ ఇండెక్స్​ ద్వారా తెలిసింది.

ప్రకటనల నిలిపివేత ఎందుకు?

ఇటీవల అమెరికాలో జాత్యంహకర ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఇందుకు సామాజిక మాధ్యమాలు వేదికలుగా మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా సంస్థలపై ఒత్తిడి పెంచేందుకు దిగ్గజ సంస్థలు ప్రకటనలు నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే వెరిజోన్​ కమ్యునికేషన్​ సహా పలు సంస్థలు ఫేస్​బుక్​కు ప్రకటనలు నిలిపివేసి బాయ్​కాట్ ఫేస్​బుక్​ పేరుతో నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో యునిలీవర్ చేరింది.

ఇదీ చూడండి:ఫేస్​బుక్​, ట్విట్టర్​కు యునిలీవర్​ షాక్​

ABOUT THE AUTHOR

...view details