దేశీయ ఐటీ-బీపీఓ రంగ ఆదాయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం వృద్ధి చెందుతాయని నాస్‌కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్) అంచనావేసింది. ఇందులోనూ డిజిటల్ విభాగ ఆదాయాల్లో 23 శాతం వృద్ధి లభించే అవకాశం ఉందని తెలిపింది. ఖాతాదార్ల అవసరాలను గమనించి, డిజిటల్ సేవల విస్తృతిపై దృష్టిపెట్టిన కంపెనీలు ఇప్పటికే 28 శాతం ఆదాయాన్ని ఈ విభాగం నుంచే ఆర్జిస్తున్నాయి. ఇందుకోసమే ప్రస్తుత ఉద్యోగులకూ ఆయా నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పిస్తూ, నూతన నియామకాల్లోనూ వీటికే ప్రాధాన్యమిస్తున్నాయి.
ఏటా 6 లక్షల మందికి పునఃశిక్షణ
దేశీయంగా ఐటీ రంగంలో దాదాపు 44 లక్షల మంది పనిచేస్తున్నారు. అవసరానికి తగిన కోర్సులు నేర్వని ఉద్యోగులకు, ప్రతిభ చూపని వారికి ఉద్వాసన పలుకుతున్న ఐటీ కంపెనీలు, గతేడాది దాదాపు 6 లక్షల మందికి డిజిటల్ సాంకేతికతలపై కంపెనీలు శిక్షణ ఇప్పించాయి. ఈ ఏడాది దాదాపు అదేస్థాయిలో ఈ శిక్షణ ఉండొచ్చని శిక్షణ సంస్థల అంచనా.
- దేశంలో ఐటీ నిపుణులు - 43.6 లక్షలు
- 2019-20 నియామకాలు - 2.05 లక్షలు
- డిజిటల్ నైపుణ్యాలు నేర్చినవారు - 8.84 లక్షలు
- దేశీయ ఐటీ పరిశ్రమ ఆదాయం - 14 లక్షల కోట్లు
ఉద్యోగంలో కొనసాగాలంటే, డిజిటల్ టెక్నాలజీలపై పట్టు సాధించడం తప్పనిసరి. ఉద్యోగులు కూడా ముందుకొస్తున్నారు. మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్.. ఏదైనా వినియోగించుకుని తమకు అనువైన సమయాల్లోనే కొత్త కోర్సులు అభ్యసించే వీలును ఉద్యోగులకు ఐటీ కంపెనీలు కల్పిస్తున్నాయి. తగిన నైపుణ్యాలు గల వారిని ఎంపిక చేయడంతో పాటు, శిక్షణ ఇచ్చే బాధ్యతలను వేరే సంస్థలకు అప్పగిస్తున్నాయి.
ఐటీ రంగంలో అనుభవజ్ఞులు, దిగ్గజ కంపెనీల్లో ఉన్నతస్థానాల్లో పనిచేసిన వారితో ప్రణాళికలు రూపొందించి, ఆ మేరకు శిక్షణ ఇప్పించడంలో మరికొన్ని కంపెనీలు నిమగ్నమవుతున్నాయి. దిగ్గజ సంస్థలకు ఇందువల్ల సమయం, వ్యయాలు ఆదా అవుతున్నాయని ఇలాంటి సేవలను భారత్, అమెరికాలో అందిస్తున్న టెక్‌ఎరా ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్ తెలిపారు.
విద్యార్థులకు మెరుగైన అవకాశాలు