తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్‌లోకి మహీంద్రా కొత్త థార్- ధరెంతో తెలుసా? - మహీంద్రా థార్ డీజిల్ వేరియంట్ ధర

దేశీయ మర్కెట్​లోకి మహీంద్రా అండ్ మహీంద్రా రెండో తరం ఎస్​యూవీ థార్​ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.9.8 లక్షలుగా(ఎక్స్​ షోరూం) నిర్ణయించింది. పెట్రోల్, డీజిల్.. రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన సరికొత్త థార్ విశేషాలు ఇలా ఉన్నాయి.

Mahindra Thar 2020 Price
మహీంద్రా థార్ డీజిల్ వేరియంట్ ధర

By

Published : Oct 2, 2020, 5:18 PM IST

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా తన రెండో తరం స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ (ఎస్‌యూవీ) థార్‌ను శుక్రవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.9.8 లక్షలుగా, గరిష్ఠ ధరను రూ.13.75 లక్షలుగా (ఎక్స్‌షోరూం) నిర్ణయించింది. బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన సరికొత్త థార్‌ ఏఎక్స్‌, ఎల్‌ఎక్స్‌ మోడళ్లలో.. పెట్రోల్‌, డీజిల్‌ సదుపాయాలతో వస్తోంది.

వేరియంట్ల పరంగా ధరలు..

పెట్రోల్‌ ఏఎక్స్‌ వేరియంట్ల ధరలు రూ.9.8 లక్షల నుంచి ప్రారంభమై గరిష్ఠంగా రూ.11.9 లక్షల వరకు ఉన్నాయి.

డీజిల్‌ ఏఎక్స్‌ వేరియంట్లు రూ.9.8 లక్షల నుంచి ప్రారంభమై రూ.12.2 లక్షల వరకు ఉన్నాయి. ఇక పెట్రోల్‌ ఎల్‌ఎక్స్‌ వేరియంట్‌లో మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ ధరను కంపెనీ రూ.12.49 లక్షలుగా నిర్ణయించగా.. డీజిల్‌ ఎల్‌ఎక్స్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ గరిష్ఠ ధరను రూ.12.95 లక్షలుగా పేర్కొంది. పెట్రోల్‌ వెర్షన్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌లో వస్తున్న ఎల్‌ఎక్స్‌ మోడల్‌ గరిష్ఠ ధరను రూ.13.75 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

ఫీచర్లు..

పెట్రోల్‌ వేరియంట్లు 2 లీటర్ల ఇంజిన్‌తో 150 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. డీజిల్‌ వేరియంట్లు 2.2 లీటర్ల ఇంజిన్‌తో 130 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. 17.7 టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌తో పాటు అడ్వెంచర్‌ స్టాటిస్టిక్స్‌ డిస్‌ప్లే, క్రూయిజ్‌ కంట్రోల్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి.

శుక్రవారం నుంచి బుకింగులు తెరిచామని, వచ్చే నెల నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త థార్‌ మరోసారి అందరి మనసులనూ గెలుచుకుంటుందని, కొత్త కస్టమర్లను ఆకర్షిస్తుందని మహీంద్రా అండ్‌ మహీంద్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా విశ్వాసం వ్యక్తం చేశారు. థార్‌ను కంపెనీ నాసిక్‌ ప్లాంట్‌లో తయారు చేశారు.

ఇదీ చూడండి:కరోనా వైరస్‌కు విరుగుడు- యాంటీసీరా అభివృద్ధి

ABOUT THE AUTHOR

...view details