తెలంగాణ

telangana

ETV Bharat / business

కార్గో సేవల రంగంలోకి మహీంద్ర లాజిస్టిక్స్‌ - కార్గో సేవలు

మహీంద్ర లాజిస్టిక్స్​ సంస్థ.. ఈడెల్​ పేరిట కార్గో సేవల రంగంలోకి అడుగుపెట్టింది. ప్రయోగాత్మకంగా దేశంలోని 6 ప్రధాన నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది. బెంగళూరు, దిల్లీ, పుణె, హైదరాబాద్​, కోల్​కతా, ముంబయిలో గురువారం నుంచి మహీంద్ర లాజస్టిక్​ కార్గో సేవలు మొదలయ్యాయి.

Mahindra logistics
కార్గో సేవల రంగంలోకి మహీంద్ర లాజిస్టిక్స్‌

By

Published : Jan 8, 2021, 5:16 AM IST

మహీంద్ర లాజిస్టిక్స్‌ సంస్థ కార్గో సేవలను ప్రారంభించింది. ఈడెల్‌ పేరిట కార్గో సేవల రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఈ కామర్స్‌, ఎఫ్‌ఎంసీజీ తదితర విభాగాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ తాజాగా కార్గో రంగంలోనూ తన సేవలను విస్తరించనుంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కార్గో విభాగంలో అడుగుపెట్టినట్లు సంస్థ తెలిపింది. ప్రయోగాత్మకంగా దేశంలోని 6 ప్రధాన నగరాల్లో ఈ సేవలను ప్రారంభించారు. మెట్రో నగరాలైన బెంగళూరు, దిల్లీ, పుణె, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయిలో గురువారం నుంచి మహీంద్ర లాజిస్టిక్స్‌ కార్గో సేవలు మొదలయ్యాయి. ఏడాది వ్యవధిలో ఈ సేవలను 14 నగరాలకు విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు సంస్థ ఎండీ, సీఈఓ ప్రవీణ్‌ స్వామినాథన్‌ తెలిపారు.

కార్గో సేవల కోసం ప్రయోగాత్మకంగా ఎలక్ట్రిక్‌ ఆటోలను నియోగించనున్నారు. దీనికోసం సరఫరాదారులతో మహీంద్ర లాజిస్టిక్స్‌ ఒప్పందం కుదుర్చుకోనుంది. వినియోగదారుల అవసరాన్ని బట్టి భవిష్యత్‌లో వాహనాల సంఖ్యను పెంచే యోచనలో ఉన్నారు. మొదటి విడతగా దాదాపు 1000 వాహనాలను వినియోగించనున్నారు. ‘‘పర్యావరణానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఎలక్ట్రిక్‌ వాహనాలను వాడుతున్నాము. అవసరాలకు అనుగుణంగా పని చేస్తూ వినియోగదారులకు మరింత చేరువుతాం’ అని స్వామినాథన్‌ వెల్లడించారు.

ఇదీ చూడండి:'దేశాన్ని నడిరోడ్డు మీదకు తెచ్చిన ఘనత మీదే'

ABOUT THE AUTHOR

...view details