బోయింగ్ విమానాల్లో వినియోగించే ఇన్‌లెట్ అవుటర్ బ్యారెల్ విడిభాగాలను, బి737 విమానాలకు అవసరమైన సబ్-అసెంబ్లీలను (B737 plane's inlet outer) మహీంద్రా గ్రూపు సంస్థ అయిన మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్ (Mahindra Aero structures) ఉత్పత్తి చేయనుంది. ఈ విడిభాగాలను బోయింగ్‌కు సరఫరా చేయనున్నట్లు మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
బోయింగ్ విమానాలకు 'మహీంద్రా' విడిభాగాలు - బోయింగ్ బి737 విమానాలు
మహీంద్రా గ్రూప్ కంపెనీ మహీంద్రా ఏరోస్ట్రక్చర్ (Mahindra Aerostructures) భారీ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకుంది. బోయింగ్ విమానాల్లో వినియోగించే.. ఇన్‌లెట్ అవుటర్ బ్యారెల్ (B737 plane's inlet outer) విడిభాగాలను, బి737 విమానాలకు అవసరమైన సబ్-అసెంబ్లీల సరఫరాకు బోయింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.
![బోయింగ్ విమానాలకు 'మహీంద్రా' విడిభాగాలు Boeing flight](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12859595-thumbnail-3x2-boeing.jpg)
2023 నుంచి ఉత్పత్తి మొదలు పెట్టనున్నట్లు, వీటిని నేరుగా అమెరికాలోని బోయింగ్ యూనిట్లకు అందించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బోయింగ్‌తో మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. బి737 విమానాల ఉత్పత్తిని పెంచే యత్నాల్లో బోయింగ్ నిమగ్నమై ఉంది. అందుకు అనువుగా విడిభాగాలను పెద్దఎత్తున సమీకరిస్తోంది. 'బోయింగ్ అత్యన్నత ప్రమాణాలను ఆశిస్తుంది. ఈ కాంట్రాక్టును దక్కించుకోవటం అంటే, మా సత్తాకు గుర్తింపు సాధించినట్లే' అని మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్ సీఈఓ అర్వింద్ మెహ్రా వివరించారు.
ఇదీ చదవండి:ఏఎంజీ సెగ్మెంట్లో బెంజ్ 12వ మోడల్.. ధర ఎంతంటే?