ఏదైనా కారణం వల్ల డెబిట్ కార్డ్ పోగొట్టుకుంటే.. దానిని బ్లాక్ చేసి.. కొత్త కార్డ్ తీసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేసింది ఎస్బీఐ. ఖాతాదారు ఇకపై కార్డ్ బ్లాక్ చేసి కొత్త కార్డ్ పొందేందుకు ప్రత్యక్షంగా బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించాల్సిన అవసరం లేదు.
ఇందుకు ఖాతాదారుడు చేయాల్సిందల్లా.. రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి బ్యాంక్ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం. ఆ తర్వాత అందులో వాయిస్ అసిస్టెంట్ చెప్పే.. సూచనలు ఫాలో అవ్వడమే.
ఐవీఆర్‌లో చెప్పే ససూచనలు..
1. 1800 112 211 లేదా 1800 425 3800 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి.
2. వాయిస్ అసిస్టెంట్ చెప్పిన వంటెనే కార్డ్ బ్లాకింగ్ కోసం '0' ప్రెస్ చేయాలి
3. ఇప్పుడు మీకు కార్డ్ బ్లాకింగ్ కోసం రెండు సదుపాయాలను చెబుతుంది వాయిస్ అసిస్టెంట్.
మొదటి ఆప్షన్ ఎంచుకుంటే.. పోగొట్టుకున్న డెబిట్ కార్డ్ నంబర్ చివరి ఐదు అంకెలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1 నొక్కి నిర్ధరించాల్సి ఉంటుంది.
రెండో ఆప్షన్ ఎంచుకుంటే... అకౌంట్ నంబర్లోని ఐదు అంకెలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1 నొక్కి నిర్ధరించాలి.