ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో దేశీయ లాజిస్టిక్స్ రంగంలో సుమారు 1.49 లక్షల ఉద్యోగాలు పెరిగే అవకాశముందని ఓ నివేదిక అంచనా వేసింది. టీమ్ లీస్ సర్వీసెస్ అనే సంస్థ ఈ నివేదికను రూపొందించింది.
2019-20 (ఏప్రిల్-సెప్టెంబర్) నాటికి లాజిస్టిక్స్ రంగంలో ఉద్యోగకల్పన 3 శాతం(1.49 లక్షల ఉద్యోగాలు) పెరగొచ్చని ఈ సర్వే పేర్కొంది. 19 రంగాల్లో... భారత్లోని 775 ఎంటర్ప్రైజెస్, ప్రపంచ వ్యాప్తంగా 85 వ్యాపారాలపై జరిగిన సర్వే ఆధారంగాఉద్యోగ కల్పన ముఖ చిత్రాన్ని రూపొందించింది.
"2018-19 రెండవ అర్థ భాగం నాటి గణాంకాల ప్రకారం దేశంలో ప్రస్తుతం లాజిస్టిక్స్ రంగంలో 82.4 లక్షల ఉద్యోగాలున్నాయి. టైర్-2, టైర్-3 పట్టణాల్లో ఈ-కామర్స్ కంపెనీల విస్తరణ వల్లే ఈ రంగంలో నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు పెరిగాయి." --- సుదీప్ సేన్, టీమ్ లీస్, ఇండస్ట్రీయల్ విభాగ అధిపతి.