జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) వచ్చే ఏడాది రెండో అర్థభాగంలో ఉండొచ్చని ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు.
పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగంలో ఎల్ఐసీలో వాటాను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ ద్వారా విక్రయించున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
ఐపీఓ కోసం ఎల్ఐసీలో పలు మార్పులు అవసరమవుతాయని రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇందుకోసం ఆర్థిక మంత్రిత్వశాఖతో చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. లిస్టింగ్ కోసం ప్రస్తుతమున్న విధానాన్నే పాటిస్తామని పేర్కొన్నారు.
ఐపీఓ ద్వారా ఎంత మొత్తంలో ఎల్ఐసీ వాటా విక్రయించనున్నారన్న ప్రశ్నకు.. 10 శాతం వరకు ఉండొచ్చని, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు రాజీవ్ కుమార్.