తెలంగాణ

telangana

ETV Bharat / business

స్మార్ట్​ఫోన్లలోనే 'బాహుబలి' ఈ కొత్త మోడల్​! - కెమెరా

లెనోవో జెడ్​-6 ప్రో భారత మార్కెట్లోకి సెప్టెంబర్​ 5న విడుదల కానుంది. 12 జీబీ ర్యామ్​, 512 జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​​ వంటి బాహుబలి ఫీచర్లతో వస్తున్న లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఇది. అదే రోజు మరో రెండు ఫోన్లు విడుదల కానున్నాయి.

లెనోవో నుంచి 'బాహుబలి' ఫోన్​... వచ్చే వారమే!

By

Published : Aug 30, 2019, 12:48 PM IST

Updated : Sep 28, 2019, 8:38 PM IST

లెనోవో జెడ్-​6 ప్రో... ఇప్పటికే చైనాలో విడుదలై టెక్​ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చరవాణి భారత విపణిలోకి సెప్టెంబర్​ 5న రానుంది. లెనోవో జెడ్-6 ప్రో తో పాటు లెనోవో కే-10 నోట్, లెనోవో ఏ-6 నోట్​ అదే రోజు రానున్నాయి. మరి లెనోవో జెడ్-​6 ప్రత్యేకతలు ఏంటో చూసేద్దామా?

ఫీచర్లు...

స్నాప్‌డ్రాగన్‌ 855 ఎస్​ఓసీ, 12 జీబీ ర్యామ్​, 512జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజి వంటివి జెడ్​-6 ప్రో లోని ముఖ్యమైన ఫీచర్లు. లెనోవో ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 9 పై జెడ్​యూ-11తో నడుస్తుంది.

లెనోవో జెడ్​-6 ప్రో మోడల్​

ప్రత్యేకతలు...

  1. వాటర్‌డ్రాప్ డిస్‌ప్లే
  2. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
  3. వెనుక భాగంలో 3డీ కర్వ్‌డ్ గ్లాస్
  4. ఏఐ క్వాడ్ కెమెరా వ్యవస్థ
  5. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్
  6. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్
  7. 12 జీబీ ర్యామ్+ 512 జీబీ మెమొరీ వేరియంట్

కెమెరా...

లెనోవో జెడ్-​6 ప్రో చరవాణి వెనుక భాగంలో 4 కెమెరాలు (48 ఎంపీ+16 ఎంపీ+8 ఎంపీ+2 ఎంపీ) ఉంటాయి. ముందు భాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

లెనోవో జెడ్​-6 ప్రో బ్యాక్​ కెమెరా

బ్యాటరీ సహా...

4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వేగవంతమైన చార్జింగ్, ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ వ్యవస్థ, 6.39 అంగుళాల అమోలెడ్ తెర, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

లెనోవో జెడ్​-6 ప్రో

ధర....

లెనోవో జెడ్​-6 ప్రో ధర రూ.30వేల నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది.

Last Updated : Sep 28, 2019, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details