ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ మార్కెట్లో భారీ లాభాల్లో ట్రేడవుతోంది.
ఆర్బీఐ నిబంధనల మేరకు కోటక్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ తన వ్యక్తిగత వాటాను 26 శాతానికి పరిమితం చేసుకునేందుకు అదనంగా ఉన్న 2.83 శాతం వాటాను రూ.6,800 కోట్లకు మంగళవారం విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోటక్ బ్యాంక్ షేర్లు దాదాపు 8 లాభంతో ట్రేడవుతున్నాయి.
- బీఎస్ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.88 శాతం వృద్ధి చెందింది. షేరు విలువ రూ.1,347.75కి చేరింది.
- ఎన్ఎస్ఈలో 7.97 శాతం పుంజుకున్న కోటక్ బ్యాంక్ షేరు విలువ రూ.1,348 వద్ద ఉంది.
టాటా పవర్ జోరు..