సార్వత్రిక ఎన్నికల తర్వాత మోదీ 2.0 ప్రభుత్వం వచ్చే 5న తొలి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈసారి పూర్తి స్థాయి ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఒకసారి ఈ బడ్జెట్ అమోదం పొందితే ఎన్నికల ముందు అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ రద్దు కానుంది.
చాలా మందికి తెలియని విషయమేంటంటే.. దేశ వ్యాప్తంగా వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం బడ్జెట్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారని.
ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల బృందం వరుస సమావేశాలతో బడ్జెట్ రూపకల్పనపై తుది కసరత్తు చేస్తోంది. ఎవరు ఆ సభ్యులు? వారి కర్తవ్యాలేంటో తెలుసుకుందాం పదండి.
1. నిర్మలా సీతారామాన్, ఆర్థిక మంత్రి
నిర్మలా సీతారామన్ మొదటి సారి పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు ఆమె ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ప్రస్తుత బడ్జెట్‌ను రూపొందించడంలో పూర్వ అనుభవం ఆమెకు కలిసిరానుంది.
ఆర్థిక మంత్రిగా నిర్మాలా సీతారామన్ బడ్జెట్ రూపొందించి.. పార్లమెంటులో ప్రవేశపెట్టడం ప్రధాన కర్తవ్యం. ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీలు అమలయ్యేలా బడ్జెట్ రూపంలో వాటి అమలు బాధ్యత ఆమెపై ఉంది.
2.అనురాగ్‌సింగ్ ఠాకూర్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి
ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక మంత్రికి సహాయం చేయడం ఠాకూర్ ప్రధాన కర్తవ్యం. ఆర్థిక మంత్రి అందుబాటులో లేనప్పుడు ఆమె స్థానంలో బడ్జెట్ వాటాదారులతో సమావేశాలు నిర్వహించడం వంటివి చేస్తారు.
హిమాచల్ ప్రదేశ్ నుంచి నాలుగో సారి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన ఠాకూర్ గతంలో బీసీసీఐ అధ్యక్షునిగా కూడా పని చేశారు.
3.కృష్ణ మూర్తి సుబ్రమణియన్, ప్రధాన ఆర్థిక సలహాదారు