తెలంగాణ

telangana

ETV Bharat / business

ధీమాగా బీమా పొందాలంటే? - పాలసీ

జీవిత బీమా ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. అయితే బీమా తీసుకున్నాక కొన్ని పొరపాట్ల కారణంగా పాలసీని క్లెయిమ్ చేసుకునే సమయంలో తిరస్కరణకు గురవుతుంది. అలా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు బీమా విషయంలో పాటించాల్సిన నిబంధనలేంటో తెలుసుకుందాం.

ధీమాగా బీమా

By

Published : Mar 17, 2019, 1:14 PM IST

జీవిత బీమాలపై ప్రస్తుతం చాలా మంది శ్రద్ధ చూపిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా ప్రమాదంలో గాని అనారోగ్యంతో గాని మరణిస్తే ఎటువంటి చింతా లేకుండా లబ్ధిదారులకు డబ్బు అందుతుంది. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కుటుంబానికి అండగా నిలుస్తూ వారికి ఆర్థికపరమైన స్థిరత్వాన్ని ఇస్తుంది. అయితే ఇవన్ని కొన్ని రకాల షరతులతో ముడి పడి ఉంటాయి.

పాలసీ తీసుకునేటప్పుడు వీటిని జాగ్రత్తగా పరిశీలించి తీసుకోకపోతే పాలసీని క్లెయిమ్ చేసుకునేటప్పుడు తిరస్కరణకు గురికావచ్చు. ఇలా జరగడానికి చాలా రకాల కారణాలున్నాయి.

ఆరోగ్య సమస్యలు, అలవాట్లు చెప్పకపోవడం

ఆరోగ్య సమస్యలు

బీమా కొనేందుకు ముందు మీకున్న అనారోగ్య సమస్యలు సహా ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను తెలపడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల అనారోగ్యాల కారణంగా మరణిస్తే పాలసీ క్లెయిమ్​ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ముందు నుంచి ఉన్న రోగాలు బీమా ఏజెంటుకు చెప్పడం ద్వారా మీకు తగిన పాలసీని సూచిస్తారు. ఆ సమయంలో మీ ప్రస్తుత ఆరోగ్య స్థితి గురించి బీమా ఏజెంటుకు పూర్తిగా చెప్పడం చాలా ముఖ్యం.

ఆత్మ హత్య లేదా స్వయంగా గాయపరుచుకోవడం

ఆత్మ హత్య

పాలసీదారు ఆత్మహత్యకు పాల్పడితే పాలసీ నియమాల ప్రకారం కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పాలసీ తీసుకున్న ఏడాదిలోపు పాలసీదారు ఆత్మహత్యకు పాల్పడితే బీమా ఫలితాలు దక్కవు.

ఏడాది తర్వాత అయితే వీటి నుంచి పాలసీ ద్వారా కొంత మొత్తంలో బీమా ఫలితాలు పొందే అవకాశం ఉంది.

ఉదాహరణకు హెచ్​డీఎఫ్​సీ టర్మ్​ పాలసీ తీసుకున్న 12 నెలల్లోపు పాలసీదారు ఆత్మహత్యకు పాల్పడితే లబ్ధిదారులు 80 శాతం ప్రీమియం మాత్రమే పొందుతారు.
ప్రమాదకర రేసింగ్​ వంటి క్రీడల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి టర్మ్​ పాలసీ ఫలితాలు వర్తించవు.

మద్యానికి బానిసకావడం

మద్యానికి బానిసకావడం

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం మద్యం తీసుకోవడం కారణంగా భారత్​లో ఏటా 2.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇందులో లివర్​ సంబంధిత రోగాల బారిన పడి కొందరు మరణిస్తే మరికొందరు తాగి వాహనం నడపి ప్రమాదంలో మరణిస్తున్నారు.

పాలసీదారులు నిర్దేశించిన స్థాయికి మించి ఆల్కహాల్​ను సేవించి ఏదైనా ప్రమాదంలో మరణిస్తే పాలసీని ఇచ్చే కంపెనీలకు క్లెయిమ్​ను తిరస్కరించేందుకు అన్ని రకాల అధికారాలుంటాయి. ఇలాంటి అలవాట్లను పాలసీ తీసుకునే ముందే చెప్పడం వల్ల క్లెయిమ్ విషయంలో తలెత్తే ఇబ్బందులను తప్పించుకోవచ్చు.

చట్టవిరుద్ధ కార్యకలాపాలు

చట్టవిరుద్ధ కార్యకలాపాలు

చట్టాలను ఉల్లంఘించడం సహా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కూడా పాలసీ క్లెయిమ్​ను తిరస్కరించే అధికారం బీమా కంపెనీలకు ఉంటుంది.

పాలసీదారు ఏదైనా నేరం చేసి పోలీసు ఎన్​కౌంటర్లో మరణిస్తే వారికి బీమా వర్తించదు. పాలసీదారు ఎటువంటి క్రిమినల్​ చట్టాలను ఉల్లంఘించినా మరణాంతరం బీమా ఫలితాలు వర్తించవు.

-సంతోష్​ అగర్వాల్, అసోసియేట్​ డైరెక్డర్​, జీవిత బీమా పాలసీబజార్.కామ్​​

ABOUT THE AUTHOR

...view details