తెలుగు రాష్ట్రాల నుంచి ఇటీవల ఐపీఓకు వచ్చిన క్రిష్ణ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ (కిమ్స్), దొడ్ల డెయిరీ సంస్థలు ఎక్స్ఛేంజీల్లో సోమవారం లిస్టింగ్‌కు వచ్చాయి. తొలిరోజు ట్రేడ్‌లోనే రెండు సంస్థలు దూసుకుపోతున్నాయి.
కిమ్స్ 28 శాతం వృద్ధి..
రూ.825 వద్ద ఇష్యూకు వచ్చిన కిమ్స్ షేరు.. బీఎస్ఈలో 22.29 శాతం లాభంతో రూ.1,008.90 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. కిమ్స్ షేర్లపై మదుపరులు ఆసక్తి చూపడం వల్ల ఒకానొక దశలో 28.23 శాతం లాభపడి.. షేరు విలువ రూ.1,057.95 గరిష్ఠ స్థాయిని తాకింది.
ఎన్ఎస్ఈలో 22.30 శాతం లాభంతో రూ.1,009 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది కిమ్స్.
బీఎస్ఈ ప్రకారం.. కిమ్స్ మార్కెట్ విలువ రూ.7,671.46 కోట్లకు చేరింది.
ఈ నెలలోనే ఐపీఓకు వచ్చిన కిమ్స్.. 3.86 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్లను సాధించింది. కిమ్స్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ ఆస్పత్రులను నిర్వహిస్తోంది. త్వరలో తమిళనాడులో ఆస్పత్రిని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.