తెలంగాణ

telangana

ETV Bharat / business

'కియా' జోష్​: పండుగ వేళ అదిరే అమ్మకాలు - kia motors september sales

కియా మోటర్స్​ ఇండియా సెప్టెంబర్​ నెలలో అమ్మకాల్లో దుసుకెళ్లింది. ఎస్​యూవీ-సెల్టోస్​ మోడల్​కు చెందిన 7,554 కార్ల విక్రయాలు జరిగినట్లు ప్రకటించింది. ఈ నెలలో మొత్తం 50 వేల బుకింగ్స్​ వచ్చాయని తెలిపింది.

'కియా' జోష్​: పండుగ వేళ అదిరే అమ్మకాలు

By

Published : Oct 10, 2019, 5:58 PM IST

సెప్టెంబర్​ నెలలో కియా మోటర్స్​ ఇండియా విక్రయాల జోరు కొనసాగించింది. ఎస్​యూవీ-సెల్టోస్​ మోడల్​కు చెందిన 7,554 కార్ల విక్రయాలు జరిగినట్లు ప్రకటించింది. ఇదే నెలలో 50 వేల యూనిట్లకుపైగా ముందస్తు బుకింగ్​లు నమోదైనట్లు తెలిపింది.

ఆగస్టు 22న భారత విపణిలోకి ఎస్​యూవీ-సెల్టోస్​ మోడల్స్​ను విడుదల చేసింది కియా. ఆగస్టు-సెప్టెంబర్​ నెలల్లో మొత్తం 13,990 యూనిట్లు​ విక్రయించినట్లు తెలిపింది.

హరియాణాలోని గురుగ్రామ్​లో తన మొదటి బ్రాండ్​ ఎక్స్​పీరియన్స్​ కేంద్రం 'బీట్​-360'ని గురువారం ప్రారంభించింది సంస్థ. భారత్​లోని ఇతర మెట్రో నగరాల్లోనూ ఇలాంటి కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపింది. సుమారు 5వేల చదరపు అడుగుల మేర ఉన్న ఈ కేంద్రం కియా ప్రయాణం, బ్రాండ్​, ఉత్పత్తుల వంటి విషయాల్లో కస్టమర్లుకు అవగాహన కల్పించే విధంగా తీర్చిదిద్దారు.

ఇదీ చూడండి: దీపావళి ముందు తగ్గిన బంగారం జోరు...!

ABOUT THE AUTHOR

...view details