తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా కార్వీ చర్యలు - karvy latest news

ఖాతాదారుల షేర్లను అనుమతి లేకుండా తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రుణాలు పొందిందని ఆర్వోసీ విచారణలో తేలింది. ఈ రుణాలను గ్రూపు కంపెనీల్లోకి తరలించిందని వెల్లడైంది. ఇలా 9 కంపెనీలను వాడుకుందని స్పష్టమైంది. ఈ కంపెనీలపై వీలైనంత త్వరగా దర్యాప్తు జరపాలని ఆర్వోసీ అభిప్రాయపడింది.

karvy actions against the public interest, says roc demanding probe into this matter
ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా క్వారీ చర్యలు

By

Published : Aug 4, 2020, 5:54 AM IST

Updated : Aug 4, 2020, 6:35 AM IST

తమ ఖాతాదారుల షేర్లను, వారి అనుమతి లేకుండా తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొందిన కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఎస్‌బీఎల్‌), వాటిని గ్రూపు కంపెనీల్లోకి తరలించిందని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్వోసీ) తమ విచారణ నివేదికలో వెల్లడించింది. నేరపూరిత ఉద్దేశంతో ఇలా చేసేందుకు 9 కంపెనీలను వాడుకుందని పేర్కొంది. కెఎస్‌బీఎల్‌ కార్యకలాపాలతో పాటు కార్వీ గ్రూపు కంపెనీలు, దాని పరిధిలోని 9 కంపెనీలపై వీలైనంత త్వరగా కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ దర్యాప్తు జరిపించాలని అభిప్రాయపడింది.

ఒకే చిరునామాతో 24 కంపెనీలు

కేఎస్‌బీఎల్‌కు 22 అనుబంధ కంపెనీలుండగా, వాటిలో 11 కంపెనీలకు చెందిన ఖాతాలు కేఎస్‌బీఎల్‌ కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారని పేర్కొంది. కేఎస్‌బీఎల్‌ వ్యవహారాల్లో సి.పార్థసారథి, ఎం.శివరామకృష్ణలు కీలక పాత్ర పోషించారని, వీరిద్దరూ కలిసి 79 కంపెనీల్లో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, హిమాచల్‌ ప్రదేశ్‌, దిల్లీల్లో కంపెనీలుండగా 24 కంపెనీలు బంజారాహిల్స్‌లోని ఒకే చిరునామాతో రిజిస్టర్‌ అయ్యాయని తెలిపింది. 24 కంపెనీల్లో 13 మాత్రమే నడుస్తుండగా, ఒకటి విలీనంకాగా మరో 10 రద్దయినట్లు తెలిపింది.

రుణాలు

సెబీ ఉత్తర్వుల ప్రకారం చూస్తే రూ.1433 కోట్లు అయిదు బ్యాంకుల్లో రుణాలు ఉన్నప్పటికీ 2019 మార్చి 31నాటికి దీర్ఘకాలిక రుణాలు రూ.48.5 కోట్లు, స్వల్పకాలిక రుణాలు 548.2 కోట్లు, సెక్యూర్డ్‌ రుణాలుగా రూ.224.5 కోట్లు, అన్‌సెక్యూర్డ్‌ రుణాలుగా రూ.175.9 కోట్లు తీసుకుందని తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరం అంతంలో 9 నెలల్లో రూ.980 కోట్లు రుణాలు తీసుకున్నట్లు వెల్లడించింది.

హామీలు!

కార్వీ డేటా మేనేజ్‌మెంట్‌కు చెందిన రూ.24 లక్షల ఈక్విటీ షేర్లను తాకట్టు పెట్టడం ద్వారా బజాజ్‌ ఫైనాన్స్‌ నుంచి రూ.345 కోట్లు రుణాలు పొందినప్పటికీ ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ నుంచి షేర్లు, సెక్యూరిటీలపై రూ.350 కోట్ల రుణం తీసుకున్నప్పటికీ, రికార్డుల్లో హామీలను పరిశీలిస్తే రూ.195 కోట్లకే ఉన్నాయని తేలిందని తెలిపింది. కేఎస్‌బీఎల్‌ రూ.682.47 కోట్ల కార్పొరేట్‌ హామీని ఇవ్వడంతోపాటు కార్వీ డేటా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ రూ.100 కోట్ల రుణానికి హామీ ఇచ్చిందని తెలిపింది. 2016 నుంచి 2019 వరకు కేఎస్‌బీఎల్‌ నుంచి కార్వీ రియల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.1096 కోట్లు నిధుల మళ్లింపు జరిగిందని తేలింది. రూ.2873.82 కోట్ల సెక్యూరిటీలు తాకట్టు పెట్టి రూ.851.43 కోట్లు నిధులను సెప్టెంబరు 2019 నాటికి సేకరించగా, 2019 నవంబరునాటికి రూ.2277.59 కోట్లు సెక్యూరిటీలు తాకట్టులోనే ఉన్నాయంది.

186 బ్యాంకు ఖాతాలు..

కేఎస్‌బీఎల్‌కు 186 ఖాతాలుండగా, వాటిలో 145 ఖాతాలు యాక్టివ్‌గా ఉండగా, 7 ఖాతాల్లో లావాదేవీలు లేవని, 34 బ్యాంకు ఖాతాలను మూసివేసింది.

Last Updated : Aug 4, 2020, 6:35 AM IST

ABOUT THE AUTHOR

...view details