తెలంగాణ

telangana

ETV Bharat / business

జాగ్వార్​ ల్యాండ్ రోవర్​ నుంచి 10 కొత్త మోడళ్లు! - జాగ్వార్ ల్యాండ్ రోవర్ లేటెస్ట్ న్యూస్​

భారత మర్కెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పది కార్లను విడుదల చేయనున్నట్లు జాగ్వార్​ ల్యాండ్​ రోవర్​ (జేఎల్​ఆర్​) ప్రకటించింది. కొత్తగా వచ్చే మోడళ్లలో విద్యుత్ వాహనాలకు అధిక ప్రాధాన్యం ఉండొచ్చని తెలుస్తోంది.

New cars from JLR
జేఎల్​ఆర్ కొత్త కార్లు

By

Published : Apr 5, 2021, 5:10 PM IST

టాటా మోటార్స్​కు చెందిన​ లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్​ ల్యాండ్ రోవర్​ (జేఎల్​ఆర్​) భారత మార్కెట్​పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 2021-22లో మొత్తం పది మోడళ్లు విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. ఇందులో కొత్త తరం కార్లు సహా ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడళ్లకు అప్​డేట్​ వెర్షన్లు కూడా ఉండనున్నాయి.

జేఎల్​ఆర్​ గత నెలలోనే.. ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ జాగ్వార్‌ ఐ-పేస్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.1.05 కోట్లు (ఎక్స్‌-షోరూం)గా నిర్ణయించింది.

ఇటీవల విడుదలైన జాగ్వార్‌ ఐ-పేస్‌

మరింత అధునాతన సాంకేతికతతో కూడిన స్టైలిష్​ మోడళ్లతో భారత్​లో మార్కెట్​ను పెంచుకోనున్నట్లు జేఎల్​ఆర్​ ఇండియా అధ్యక్షుడు, ఎండీ రోహిత్​ సూరీ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా రికవరీ సాధిస్తుండటం కూడా లగ్జరీ కార్ల మార్కెట్​కు కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు..

విద్యుత్​ కార్లకే ప్రాధాన్యం!

2039 నాటికి కంపెనీని నుంచి పూర్తిగా విద్యుత్​ వాహనాల సంస్థగా మార్చనున్నట్లు జేఎల్​ఆర్​ ఈ ఏడాది ఫిబ్రవరిలో వెల్లడించింది. 2025 నుంచి జాగ్వార్​ నుంచి అన్ని విద్యుత్ కార్లనే తీసుకురానున్నట్లు కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో త్వరలో విడుదలయ్యే కార్లలో ఎక్కువగా.. విద్యుత్ మోడళ్లు ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదీ చదవండి:మొబైల్​ వ్యాపారానికి ఎల్​జీ గుడ్​బై

ABOUT THE AUTHOR

...view details