తెలంగాణ

telangana

ETV Bharat / business

హెచ్​డీ టీవీ, సెట్​టాప్​ బాక్స్​ ఉచితంగా పొందండిలా... - set top box

జియో గిగా ఫైబర్​ వెల్​కమ్​ ఆఫర్​ కింద తక్కువ ధరలలో ఇంటర్నెట్​ సౌకర్యం కల్పించేందుకు రిలయన్స్​ సిద్ధమైంది. వార్షిక చందాతో గిగా ఫైబర్​ కనెక్షన్​ తీసుకున్నవారికి హెచ్​డీ 4కే టీవీతో పాటు సెట్​టాప్​ బాక్స్​ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు రిలయన్స్​ అధినేత ముకేశ్​ అంబానీ.

జియో

By

Published : Aug 12, 2019, 1:53 PM IST

Updated : Sep 26, 2019, 6:09 PM IST

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఫైబర్​పై ఎన్నో సంచలన ప్రకటనలు చేశారు సంస్థ అధినేత ముకేశ్ అంబానీ. ఫైబర్​ కనెక్షన్ నెలవారీ​ ప్లాన్లు రూ.700 నుంచి 10 వేల వరకు ఉంటాయని వెల్లడించారు. ఈ ధరల్లో ఇంటర్నెట్​ కనీస వేగం 100 ఎంబీపీఎస్​, గరిష్ఠ వేగం 1 జీబీపీఎస్​ అని తెలిపారు.

వెల్​కమ్​ ఆఫర్​...

జియో 4జీ నెట్​వర్క్​ అందుబాటులోకి వచ్చినప్పుడు అద్భుత ఆఫర్లు ఇచ్చింది రిలయన్స్​. గిగా ఫైబర్​ విషయంలో అంతకన్నా పెద్ద ప్రకటన చేసింది.

జియో ఫర్​ ఎవర్​ పేరిట వార్షిక ప్లాన్లు సబ్​స్కైబ్​ చేసుకునే వారికి ఉచితంగా హెచ్​డీ 4కే టీవీ, 4కే సెట్​ టాప్​ బాక్స్​ అందిస్తామని ప్రకటించింది. అయితే... జియో ఫర్​ ఎవర్​ ప్లాన్​ ఎన్ని నెలలకు వర్తిస్తుంది, ఎంత చెల్లించాలి అనే అంశాలను గిగా ఫైబర్​ సేవలు ప్రారంభమయ్యే సెప్టెంబర్​ 5న ప్రకటిస్తామని తెలిపింది రిలయన్స్.

వార్షిక చందా విలువ బట్టి టీవీ స్పెసిఫికేషన్స్​ ఉండే అవకాశం ఉంది.

ముఖేశ్​ అంబానీ

ఒక్క ప్లాన్​తో అన్నీ..

జియో గిగా ఫైబర్​ ద్వారా ఇంటర్నెట్​తో పాటు వీడియో కాలింగ్​, వీడియో కాన్ఫరెన్స్​ సదుపాయాలు ఉచితంగా అందించనుంది రిలయన్స్​. అమెరికా, కెనడాకు అపరిమితంగా ఉచిత కాల్స్ చేసేందుకు నెలకు రూ.500తో సరికొత్త ప్లాన్​ తీసుకురానుంది.

ఫస్ట్​ డే-ఫస్ట్​ షో

జియో గిగా ఫైబర్​ ద్వారా ప్రీమియం ఓటీటీ యాప్​(నెట్​ఫ్లిక్స్​, హాట్​స్టార్​ వంటివి)లను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది రిలయన్స్​.

సినిమా విడుదలైన రోజే ఇంట్లోనే కూర్చుని చూసేలా "ఫస్ట్​ డే-ఫస్ట్​ షో" సదుపాయం కల్పిస్తామని వెల్లడించింది. ఈ ఫీచర్​... 2020 ద్వితీయార్థంలోప్రీమియం వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

ఇదీ చూడండి: అదిరే ఫీచర్లు, సూపర్​ ఆఫర్లతో 'జియో గిగా ఫైబర్​'

Last Updated : Sep 26, 2019, 6:09 PM IST

ABOUT THE AUTHOR

...view details