ఇటీవలే కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్లు ప్రవేశపెట్టిన టెలికాం దిగ్గజం జియో.. మరో అడుగు ముందుకేసింది. ప్రత్యర్థి నెట్‌వర్క్‌ల పోస్ట్ పెయిడ్ వినియోగదారులను ఆకర్షించేందుకు పోస్ట్ పెయిడ్ సెక్యూరిటీ ఫీజును మాఫీ చేసింది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి జియోకి మారితే ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయబోమని ప్రకటించింది. ప్రస్తుత చందాదారులకు కంపెనీ అందించే క్రెడిట్ పరిమితిని అందిస్తున్నట్లు తెలిపింది.
" రిలయన్స్ జియో ఇప్పుడు పోస్ట్ పెయిట్ ప్లస్ ప్లాన్స్‌లోకి చేరిన ఇతర ఆపరేటర్ల పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం క్రెడిట్ పరిమితిని తొలిసారి కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఎలాంటి అదనపు, సెక్యూరిటీ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. "
- జియో సంస్థ అధికారి.