తెలంగాణ

telangana

ETV Bharat / business

డిసెంబర్​ 6 నుంచి 40 శాతం పెరగనున్న జియో ఛార్జీలు - వ్యాపార వార్తలు

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో.. మొబైల్​ సేవలకు కొత్త ప్లాన్​లను తీసుకువచ్చింది. డిసెంబర్​ 6 నుంచి ఈ ప్లాన్లు అమలుకానున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతమున్న ధరలతో పోలిస్తే.. కొత్త ప్యాక్​లలో రేట్లు 40 శాతం ఎక్కువగా ఉండనున్నట్లు వెల్లడించింది.

JIO
జియో

By

Published : Dec 1, 2019, 8:04 PM IST

దేశీయ టెలికాం సంస్థలు.. వరుసగా మొబైల్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటనలు చేస్తున్నాయి. ఇది వరకే 42 శాతం ధరలు పెంచుతున్నట్లు ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియా వెల్లడించగా.. తాజాగా ఈ జాబితాలో జియో చేరింది. 40 శాతం ఛార్జీలు పెంచుతున్నట్లు పేర్కొంది జియో.

కొత్త ప్లాన్​ల ద్వారా ఇతర నెట్​వర్క్​లకూ సరళమైన విధానామే అమలులో ఉంటుందని జియో స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:జీఎస్టీ వసూళ్ల వృద్ధి.. నవంబర్​లో మళ్లీ లక్ష కోట్ల ప్లస్

ABOUT THE AUTHOR

...view details