తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్​ జియో షాక్​: ఇకపై కాల్​ ఛార్జీలు వసూలు - రిలయన్స్​ జియో షాక్

ఉచిత కాల్స్​, తక్కువ ధరకే డేటా అందిస్తూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో... ఇక నుంచి కాల్​ ఛార్జీలు వసూలు చేయనుంది. ఇతర నెట్​వర్క్​లకు చేసే కాల్స్​పై నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది ఆ సంస్థ. నేటి నుంచి రీఛార్జ్​ చేసే వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది.

రిలయన్స్​ జియో షాక్​: ఇకపై కాల్​ ఛార్జీలు వసూలు

By

Published : Oct 9, 2019, 5:31 PM IST

ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ను ఉచితంగా అందిస్తూ కేవలం డేటాకు మాత్రమే ఛార్జ్‌ చేస్తున్న రిలయన్స్‌ జియో తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్‌గోయింగ్‌ కాల్స్‌కు ఛార్జ్‌ చేయాలని నిర్ణయించింది. ఇకపై రిలయెన్స్‌ జియో నుంచి ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌-ఐడియాకు కాల్‌ చేస్తే నిమిషానికి 6 పైసలు చెల్లించాలని రిలయెన్స్‌ జియో పేర్కొంది. అయితే ఆ మొత్తానికి సమానమైన ఉచిత డేటాను వినియోగదారులకు అందించనుంది జియో.

జియో నుంచి జియోకు, ల్యాండ్​ లైన్​, వాట్సప్​, ఫేస్​టైమ్​, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా చేసే కాల్స్​కు ఇది వర్తించదని పేర్కొంది రిలయన్స్. అన్ని నెట్​వర్క్​ల నుంచి ఇన్​కమింగ్​ కాల్స్​ ఎప్పటిలానే ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది.

నేటి నుంచి రీఛార్జ్​ చేసుకునే వినియోగదారులందరికీ ఈ నిబంధనలు వర్తించనున్నాయి.

ట్రాయ్​ నిబంధనలతో ప్రత్యర్థి నెట్​వర్క్​లకు జియో సుమారు రూ.13,500 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ నష్టాన్ని భరించేందుకే ఇతర నెట్​వర్క్​లకు చేసే కాల్స్​పై 6 పైసలు వసూలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది సంస్థ

ఐయూసీ ఛార్జ్​..

ప్రస్తుతం ట్రాయ్‌ నిబంధనల ప్రకారం టెలికం సంస్థలు ఇంటర్‌కనెక్ట్ యూసేజ్‌ ఛార్జ్‌ (ఐయూసీ)ని చెల్లించాల్సి వస్తోంది. 2017లో ఈ ఐయూసీని ట్రాయ్​ 14 పైసల నుంచి 6 పైసలుకు తగ్గించింది. ఐయూసీ 2020 జనవరి వరకు కొనసాగుతుందని అప్పట్లో పేర్కొంది. అనంతరం అది రద్దవుతుందని వెల్లడించింది. అయితే తాజాగా ఆ గడువును పొడిగించాలా లేదా అనే దానిపై ట్రాయ్‌ సంప్రదింపులు ప్రారంభించింది.

ఇదీ చూడండి: పసిడి ధరలు మళ్లీ పరుగు- ప్రస్తుత ధర ఎంతంటే...

ABOUT THE AUTHOR

...view details