ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో రానున్న రోజుల్లో భారత మార్కెట్‌పై మరింత పట్టు సాధిస్తుందని బెర్న్‌స్టెయిన్ అనే సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. 2025 నాటికి టెలికాం మార్కెట్లో జియో వాటా 48 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. ఈ సమయానికి జియో యూజర్ల సంఖ్య 50 కోట్లకుపైనే ఉంటుందని లెక్కగట్టింది.
నివేదికలోని అంశాలు..
- 2019-20లో జియోకు మొత్తం 38.8 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
- 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి జియో 50 కోట్ల యూజర్ల మార్క్ అందుకుంటుంది.
- యూజర్ల సంఖ్య 2024-25 నాటికి 56.9 కోట్లు, 2027-28 నాటికి 60.9 కోట్లకు పెరగొచ్చు.
- జియో మార్కెట్ వాటా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 38 శాతం నుంచి 40 శాతానికి పెరగొచ్చు. 2024-25 నాటికి 48 శాతానికి చేరొచ్చు.
ఐపీఓ ఎప్పుడు?
- టెలికాం రంగంలో మార్కెట్ వాటా 50 శాతానికి చేరుకుంటే రానున్న కొన్నేళ్లలోనే జియో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సగటు యూజర్ ద్వారా వచ్చే ఆదాయం కూడా భారీగా పెరగొచ్చు.
- రానున్న మూడేళ్లలో సేవాల ద్వారా జియో ఆదాయం రెండింతలు పెరిగే అవకాశం ఉంది.
పెట్టుబడులు..