తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ విమానాల్లో జియో మొబైల్ సేవలు- ప్లాన్లు ఇవే - అంతర్జాతీయ విమానాల్లో జియో మొబైల్ సేవలు

అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో మొబైల్​ సేవలు వాడుకునేందుకు వీలుగా రిలయన్స్ జియో మూడు ప్లాన్​లను విడుదల చేసింది. ఇందుకోసం పలు దిగ్గజ విమాన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది జియో.రూ.499, రూ.699, రూ.999తో ఆవిష్కరించిన కొత్త ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Jio starts offering mobile services on international flights
విమాాల్లోనాల్లో జియో మొబైల్ సేవలు

By

Published : Sep 24, 2020, 6:05 PM IST

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్​ను ప్రకటించింది. 22 అంతర్జాతీయ రూట్లలో విమానాల్లో మొబైల్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇందుకోసం జియో.. క్యాతే పసిఫిక్, సింగపూర్ ఎయిర్​లైన్స్, ఎమిరేట్స్, ఎతిహాద్ ఎయిర్​వేస్, యూరో వింగ్స్, లుఫ్తాన్సా, మలిండో ఎయిర్​, బీమన్ బంగ్లాదేశ్ ఎయిర్​లైన్స్, అలిటాలియా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

భారత్​ నుంచి ఈ ఎయిర్​లైన్ సంస్థల విమానాల్లో ప్రయాణించే వారికి జియో మొబైల్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

ప్లాన్లు ఇలా..

  • 1.రూ.499

100 నిమిషాల వాయిస్​కాల్స్, 100 ఎస్​ఎంఎస్​లు, 250 ఎంబీ డేటా

  • 2.రూ.699

100 నిమిషాల వాయిస్​కాల్స్, 100 ఎస్​ఎంఎస్​లు, 500 ఎంబీ డేటా

  • 3.రూ.999

100 నిమిషాల వాయిస్​కాల్స్, 100 ఎస్​ఎంఎస్​లు, 1జీబీ డేటా

ఈ మూడు ప్లాన్లకు.. ఒక రోజే వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో ఇన్​కమింగ్ కాల్స్​కు మాత్రం అనుమతి లేదు. ఇన్​కమింగ్ ఎస్​ఎంఎస్​లు ఉచితమని జియో వెబ్​సైట్​ ద్వారా తెలిసింది. జియో ఫోన్లతో, జియో వైఫై డివైజ్​ ద్వారా ఈ సేవలు వినియోగించుకునే వీలు లేదని వైబ్​సైట్లో పేర్కొంది జియో.

ఇదీ చూడండి:ఆ కస్టమర్లే లక్ష్యంగా 'జియో పోస్ట్​పెయిడ్​ ప్లస్'​

ABOUT THE AUTHOR

...view details