తెలంగాణ

telangana

ETV Bharat / business

​​​​​​​'హ్యాపీ న్యూ ఇయర్' పేరుతో జియో అదిరే ఆఫర్​ - వ్యాపార వార్తలు

నూతన సంవత్సరం కోసం సరికొత్త ఆఫర్​తో ముందుకొచ్చింది టెలికాం దిగ్గజ సంస్థ జియో. "హ్యాపీ న్యూ ఇయర్" పేరుతో తీసుకువచ్చిన ఈ ఆఫర్​తో ఏడాది పాటు ఉచిత సేవలు అందించనుంది. రూ.2020 విలువ చేసే ఈ ఆఫర్​కి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం.

JIO
జియో ఆఫర్​

By

Published : Dec 24, 2019, 4:59 PM IST

సంచలనాల దిగ్గజం జియో మరోసారి అదిరే ఆఫర్​తో ముందుకొచ్చింది. ఈసారి ఏకంగా ఏడాది పాటు అన్​లిమిటెడ్​ సేవలు పొందేందుకు వీలుగా "హ్యాపీ న్యూ ఇయర్" పేరుతో కొత్త ఆఫర్​ను ప్రకటించింది.

ఈ ఆఫర్​ కింద రూ.2,020తో రీఛార్జి చేసుకున్న జియో వినియోగదారులకు ఏడాదిపాటు అన్ని రకాల సేవలు అపరిమరితంగా లభించనున్నాయి. ఇదే రూ.2,020తో మరో ఆఫర్​ కూడా ప్రకటించింది. జియోఫోన్ కొనేవారికి.. ఏడాది పాటు ఉచిత సేవలు పొందే వీలుందని జియో పేర్కొంది.

పరిమిత కాలం వరకు ఉండే ఈ ఆఫర్​ నేటి నుంచే అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్​ ముగింపుపై జియో ఇంకా స్పష్టతనివ్వలేదు.

స్మార్ట్​ఫోన్ వినియోగదారులకు..

స్మార్ట్​ఫోన్​లో జియో నెట్​వర్క్​ వాడుతున్నవారు ఈ ఆఫర్​ కింద రూ. 2,020తో రీఛార్జ్​ చేసుకున్నట్లయితే, వారు ఏడాది పాటు ఉచిత వాయిస్​కాల్స్, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు, మొత్తం 547.5 జీబీ డేటా (రోజుకు 1.5 జీబీ డేటా)ను వాడుకోవచ్చు.

ఈ నెల ఆరంభంలోనే టారీఫ్​ పెంచింది జియో. వార్షిక ప్లాన్​లో భాగంగా జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే వీలుంది. జియో నుంచి ఇతర నెట్​వర్క్​లకు 12,000 నిమిషాల ఉచిత టాక్‌టైమ్​నూ పొందవచ్చు. వీటితో పాటు జియో యాప్స్​పై ఉచిత చందా లభిస్తుంది.

జియో ఫోన్​ ఆఫర్​ ఇది..

కొత్తగా జియో ఫోన్​ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఆఫర్​ ఉత్తమమైనదిగా చెప్పొచ్చు. ఎందుకంటే రూ.2,020తో జియో ఫోన్​ కొంటే ఏడాది పాటు ఉచిత వాయిస్​కాల్స్, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు, 0.5 జీబీ డేటా వినియోగించుకోవచ్చు.

ఇలా చూస్తే.. రూ.2,020 జియో ఫోన్ కొన్న వారికి కేవలం సర్వీసులకే రుసుములు చెల్లించినట్లవుతుంది. జియో ఫోన్​ను పూర్తిగా ఉచితంగా పొందుతున్నట్లు లెక్క!

ఇదీ చూడండి:వృద్ధి భయాలతో.. మార్కెట్లకు రెండో రోజూ నష్టాలే

ABOUT THE AUTHOR

...view details