తెలంగాణ

telangana

ETV Bharat / business

జియో 4జీ టారీఫ్​లు ఇప్పట్లో పెరగవ్​.. ఎందుకో తెలుసా? - ఐడియా

ఇప్పట్లో జియో టారీఫ్​లు పెరిగే అవకాశం లేదా.. అంటే అవుననే అంటున్నారు టెలికాం నిపుణులు. 50 కోట్ల వినియోగదారులు చేరే వరకు జియో 4జీకి ఎటువంటి ఛార్జీలు పెంచొద్దని రిలయన్స్ నిర్ణయించుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

జియో

By

Published : Aug 15, 2019, 6:00 AM IST

Updated : Sep 27, 2019, 1:44 AM IST

రిలయన్స్ జియో 4జీ టారీఫ్​లను ఇప్పట్లో పెంచే అవకాశం లేదని టెలికాం నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత టారీఫ్​ల ద్వారా మాత్రమే ప్రత్యర్థి టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇవ్వగలదని జియో భావిస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు.

ఓ ప్రముఖ టెలికాం నివేదిక ప్రకారం.. 50 కోట్ల మంది వినియోగదారులను చేరుకోవడాన్నే జియో లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత టారీఫ్​ల ద్వారానే వొడాఫోన్​, ఐడియా, ఎయిర్​టెల్​ వంటి సంస్థలకు పోటీ ఇవ్వొచ్చని జియో భావిస్తోంది. కాబట్టి ఇప్పట్లో జియో4జీ టారీఫ్​ల మార్పు ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యర్థులకు గట్టి పోటీ తప్పదు!

'గిగా ఫైబర్' సేవల ప్రారంభంపై రిలయన్స్ ప్రకటన చేసిన మరుసటిరోజే వొడాఫోన్ఐడియా షేర్లు 6.4 శాతం మేర నష్టపోయాయి. ఎయిర్​టెల్ షేర్లు 5.3 శాతం క్షిణించాయి. ఈ పరిణామాలు చూస్తే మున్ముందు ప్రత్యర్థులకు ఎలాంటి పోటీ ఉండనుందో స్పష్టమవుతోంది.

విశ్లేషకుల ప్రకారం.. టెలికాం రంగంలో కొన్ని నెలలుగా ఉన్న ధరల యుద్ధం ఇప్పుడు లేదు. అయినప్పటికీ రిలయన్స్ జియో ప్రభావం మాత్రం తగ్గడం లేదు.
గతాన్ని పరిశీలిస్తే చూస్తే.. 2016లో జియో మార్కెట్లోకి వచ్చినప్పుడు అప్పటి వరకూ ఉన్న డాటా టారీఫ్​ల విషయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఈ ప్రభావం ఇతర టెలికాం సంస్థలపై భారీ ప్రభావం చూపించింది. జియో దెబ్బకు చిన్న టెల్కోలు ఇతర సంస్థల్లో విలీనమయ్యాయి. ప్రస్తుతం టెలికాం రంగంలో మూడే ప్రధాన సంస్థలు మిగిలాయి.

రెండు నెలల్లోనే నెం1 స్థానానికి!

జులైలో వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం 34 కోట్ల వినియోగదారులతో ప్రస్తుతం దేశంలోనే నెం1 టెలికాం సంస్థగా అవతరించింది జియో. అంతకు ముందు మే నెల గణాంకాల ప్రకారం జియో రెండో స్థానంలో ఉంది. కేవలం రెండు నెలల్లోనే ప్రథమ స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. ఈ లెక్కన జియోకు ప్రతి నెలా కోటి మంది వినియోగదారులు పెరగుతున్నట్లు విశ్లేషకుల అంచనా. ఈ గణాంకాల ప్రకారం జియో 50 కోట్ల వినియోగదారుల లక్ష్యం 2022 నాటికి చేరుకునే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: పన్ను ఉగ్రవాదంతో వ్యాపార భారతం ఉక్కిరిబిక్కిరి

Last Updated : Sep 27, 2019, 1:44 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details