తెలంగాణ

telangana

ETV Bharat / business

వొడా-ఐడియాకు బై- జియోకు జై... ఎందుకిలా?

టెలికాం రంగంలో రిలయన్స్ జియో దూసుకుపోతున్నట్లు ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా వొడాఫోన్-ఐడియాను వీడుతున్న వినియోగదారులను ఆకర్షించి టెలికాం రంగంలో అతిపెద్ద సంస్థగా 'జియో' ఎదిగినట్లు సర్వే అభిప్రాయపడింది.

jio
జియో

By

Published : Jan 28, 2020, 11:11 AM IST

Updated : Feb 28, 2020, 6:26 AM IST

రిలయన్స్ జియో వినియోగదారుల సంఖ్య పరంగా గత ఏడాది నవంబర్​లో అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించింది. ముఖ్యంగా వొడాఫోన్-ఐడియాను వీడిన వినియోగదారులను ఆకర్షించడంలో సఫలీకృతమై జియో ఈ స్థాయికి చేరినట్లు ఇండియా రేటింగ్స్ & రీసర్చ్ నివేదిక తెలిపింది. గత రెండేళ్లుగా వొడాఫోన్-ఐడియా వినియోగదారుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు పేర్కొంది.

టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్​' లెక్కల ప్రకారం 2019 నవంబర్​లో 36.9 కోట్ల మంది వినియోగదారులతో జియో అతిపెద్ద టెలికాం సంస్థగా ఉంది. అదే నెలలో వొడాఫోన్-ఐడియా 33.62 కోట్లు, భారతీ ఎయిర్​టెల్​ 32.73 కోట్ల మంది వినియోగదారులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మార్కెట్ వాటాలోనూ జియోదే అగ్రస్థానం..

వినియోగదారుల సంఖ్యలో మాత్రమే కాకుండా మార్కెట్​ వాటాలోనూ జియో 34.9 శాతానికి ఎదిగి ప్రథమ స్థానంలో నిలిచినట్లు నివేదిక వెల్లడించింది.

తేరుకుంటున్న టెల్కోలు..

గడిచిన రెండు మూడు త్రైమాసికాల నుంచి నష్టాల నుంచి తేరుకునేందుకు టెలికాం సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నివేదిక అభిప్రాయపడింది. ముఖ్యంగా ఇటీవల టెలికాం సంస్థలన్నీ 25 నుంచి 35 శాతం వరకు పెంచిన టారిఫ్​లు ఇందుకు దోహదం చేసే అవకాశాలున్నాయని పేర్కొంది.

ఇదీ చూడండి:ఫర్నీచర్​ కొనడం ఇక ఖరీదైన వ్యవహారమే!

Last Updated : Feb 28, 2020, 6:26 AM IST

ABOUT THE AUTHOR

...view details