వేగవంతమైన మొబైల్ నెట్వర్క్ అందిస్తున్న టెల్కోగా రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. సగటున 19.3 ఎంబీపీఎస్(మెగా బైట్స్ పర్ సెకన్) డౌన్లోడ్ స్పీడ్‌ను జియో అందిస్తున్నట్లు టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' తాజాగా వెల్లడించింది.
డౌన్లోడ్ల పరంగా ఐడియా 8.6 ఎంబీపీఎస్, వొడాఫోన్ 7.9 ఎంబీపీఎస్, భారతీ ఎయిర్టెల్ 7.5 ఎంబీపీఎస్ స్పీడ్లతో జియో తర్వాతి స్థానాల్లో నిలిచినట్లు ట్రాయ్ తెలిపింది. వొడాఫోన్, ఐడియా సంస్థలు విలీనమైనా.. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతున్నందున రెండు సంస్థల నెట్‌వర్క్‌ల పనితీరును విడివిడిగానే లెక్కించినట్లు ట్రాయ్ వివరించింది.
ఎయిర్టెల్ అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను అందిస్తున్నట్లు సెప్టెంబర్‌లో ఓ ప్రైవేటు సంస్థ నివేదిక విడుదల చేయగా.. తాజాగా ట్రాయ్ నెట్వర్క్ స్పీడ్‌పై రిపోర్ట్ విడుదల చేయడం గమనార్హం.