దేశీయంగా 5జీ సేవలు అందించేందుకు రిలయన్స్ జియో కసరత్తు ముమ్మరం చేసింది. సొంతంగా 5జీ టెక్నాలజీని రూపొందిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. సంస్థ 43వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వెల్లడించారు.
జియో 5జీ సేవలు వచ్చే ఏడాది ప్రారంభం! - వచ్చే ఏడాది జియో 5 జీ సేవలు
దేశీయంగా 5జీ సేవలు అందించే దిశగా రిలయన్స్ జియో వడివడిగా అడుగులు వేస్తోంది. త్వరలోనే 5జీ ట్రయల్స్‌ను నిర్వహించనున్నట్లు సంస్థ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. 5జీ టెక్నాలజీని సొంతంగా రూపొందిస్తున్నట్లు చెప్పడం విశేషం.
జియో 5జీ వచ్చేస్తోంది
దేశీయంగా త్వరలోనే 5జీ ట్రయల్స్‌ను నిర్వహించనున్నట్లు ముకేశ్ తెలిపారు. వచ్చే ఏడాది ఎప్పుడైనా 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రావచ్చని పేర్కొన్నారు.