టెలికాం రంగంలోకి ప్రవేశించిన మూడేళ్లకే ఆదాయంలోనూ భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా సంస్థలను వెనక్కి నెట్టింది రిలయన్స్ జియో. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసింకంలో రూ.10,900 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' వెల్లడించిన తాజా గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.
జియో తర్వాతి స్థానంలో రూ.10,707 కోట్ల ఆదాయంతో భారతీ ఎయిర్టెల్ రెండో స్థానంలో, రూ.9,809 కోట్ల ఆదాయంతో వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో ఉన్నాయి.