టెలికాం సంస్థలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు లేఖ రాసింది జియో. దుర్మార్గమైన, విభజనపూరిత ప్రచారం నిర్వహిస్తున్నాయని లేఖలో ఆరోపించింది. జియో నుంచి తమ నెట్‌వర్క్‌కు మారడం అనేది రైతు నిరసనలకు మద్దతు చర్యగా చూబుతూ.. ప్రజలను ప్రేరేపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రత్యుర్థుల చర్యలు జియో ఉద్యోగుల భద్రతను దెబ్బతీస్తాయని లేఖలో పేర్కొంది. రైతుల ఆందోళనలను సొమ్ము చేసుకునేందుకు అనైతిక, నిబంధనలకు విరుద్ధమైన మొబైల్ పోర్టబిలిటీ ప్రచారం నిర్వహించటం పట్ల ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేసింది జియో. ఇలాంటి ప్రచారం ఒక్క ఉత్తర భారతానికే పరిమితం కాలేదని, ఎంఎన్‌పీ ద్వారా వినియోగదారులను పొందేందుకు దేశవ్యాప్తంగా తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించింది. ఎయిర్టెల్, వీఐఎల్ ప్రచార సందేశాలను సూచిస్తూ తమ వినియోగాదారులు పెద్ద సంఖ్యలో నంబర్లు పోర్ట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. టెలికాం టారిఫ్ ఆర్డర్-1999 నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని స్పష్టం చేసింది.
ఖండించిన ఎయిర్టెల్, వీఐఎల్..