టెలికాం రంగంలో జియో ఓ విప్లవం సృష్టించింది. వినియోగదారులకు అతి తక్కువ ధరకు అపరిమిత కాలింగ్ సేవలు తెచ్చి.. దేశం మొత్తానికి అంతర్జాలాన్ని మరింత చేరువ చేసింది. జియో ఇచ్చిన ఉత్సాహంతో మరో సంచలనానికి నాంది పలకనుంది రిలయన్స్. బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించనుంది.
42వ వార్షిక సర్వసభ్య సమావేశంలోజియో గిగా ఫైబర్‌ను ఆవిష్కరించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. జియో గిగాఫైబర్ 4కె సెట్ టాప్ బాక్స్ ఫీచర్లను ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ, కుమార్తె ఈషా అంబానీలు వివరించారు.
మిక్స్డ్ రియాలిటీ...
వర్చువల్ రియాలిటీ, ఆగ్‌మెంటెడ్ రియాలిటీలను కలిపి మిక్స్డ్ రియాలిటీ పేరుతో కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది జియో. దీని ద్వారా వినియోగదారులు షాపింగ్‌కు వెళ్లకుండా.. ఇంట్లోనే ఉండి దుస్తులను ట్రై చేయవచ్చు. తమకు నచ్చిన దుస్తులను వర్చువల్ రియాలిటీలో చూసుకుని అనంతరం వాటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. విద్య, వినోద రంగాల్లో ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. మనకు ఎప్పటికీ ఓ రహస్యంగా తోచే అంతరిక్షం వంటి సంక్లిష్ట అంశాలపైనా మిక్స్డ్ రియాలటీ సాయంతో సులువుగా అవగాహన పెంచుకోవచ్చు.
టీవీలో వీడియో కాల్స్...