సంస్థ మూతపడకుండా ఉండేందుకు తక్షణం కావాల్సిన రూ. 4వందల కోట్ల ఆర్థిక సహాయం కోసంజెట్ ఎయిర్వేస్విఫలయత్నం చేసింది. ఈ విషయమై రుణదాతలను సంప్రదించినప్పటికీ... వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ముంబయిలో జెట్ ఎయిర్వేస్ బోర్డు సమావేశం మూడు గంటల పాటు జరిగినప్పటికీ సంస్థ భవితవ్యంపై ఎలాంటి నిర్ణయానికి రాలేదు. సంస్థను నిలబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయిప్రభుత్వం, బ్యాంకుల కన్సార్టియం. రుణానికి సంబంధించిన అంశం రుణదాతలు, సంస్థకు మధ్య జరిగే వ్యవహారమని... భేటీ అనంతరం పౌరవిమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ కరోలా వ్యాఖ్యానించారు.
ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
జెట్ ఎయిర్వేస్కు రూ.8వేల కోట్ల రుణాలున్నాయి. ఈ అప్పులను ఇచ్చిన వివిధ బ్యాంకులు.. ఎస్బీఐ సారథ్యంలో యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంకూ(పీఎన్బీ) ఉంది.
ఎయిర్‌లైన్స్‌ను కొనసాగించేందుకు చర్చలు జరుగుతున్నాయని, ఇప్పటివరకూ ఏ నిర్ణయం తీసుకోలేదని పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ మెహతా తెలిపారు.
జీతాలు చెల్లించని కారణంగా దివాలా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరతామని హెచ్చరించింది పైలట్ల సంఘం నేషనల్ ఏవియేటర్ గిల్డ్(ఎన్ఏజీ). ఉద్యోగులపై నిర్ణయం తీసుకోనట్లయితే జాతీయ కంపెనీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తామని సంఘం ఉపాధ్యక్షుడు అసీమ్ తెలిపారు.