రుణ సంక్షోభంలో చిక్కున్న జెట్ ఎయిర్వేస్ షేర్లు నేటి ట్రేడింగ్లో భారీగా పుంజుకున్నాయి. దిగ్గజ వాహన తయారీ సంస్థ హిందుజా గ్రూపు జెట్లో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా మూడో రోజు జెట్ షేర్లు మెరుస్తున్నాయి.
బీఎస్ఈలో జెట్ షేరు ప్రస్తుతం 8.59 శాతం వృద్ధితో రూ.163.70 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈలో 8.61 శాతం పెరిగిన షేరు ధర ప్రస్తుతం రూ.163.85 వద్ద కొనసాగుతోంది.