తెలంగాణ

telangana

By

Published : Jun 13, 2019, 3:04 PM IST

ETV Bharat / business

భారీగా పతనమైన జెట్ ఎయిర్​వేస్​ షేర్లు

స్టాక్ మార్కెట్లో జెట్ ఎయిర్​వేస్​ షేర్లు నేడు కుప్పకూలాయి. సంస్థపై స్టాక్ ఎక్స్చేంజీలు అంక్షలు విధించనున్న నేపథ్యంలో రెండేళ్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేశాయి.

ఎయిర్​వేస్​

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్​వేస్​పై స్టాక్ ఎక్స్చేంజీలు ఆంక్షలకు సిద్ధమైన నేపథ్యంలో సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి.
సెన్సెక్స్​లో జెట్​ షేరు 23.18 శాతం నష్టపోయింది. ఫలితంగా షేరు ధర రెండేళ్ల కనిష్ఠం వద్ద రూ.84.80కి చేరింది.

నిఫ్టీలోకూడా షేరు 23.30 శాతం పతనమై... రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతం షేరు ధర రూ.84.60 వద్ద కొనసాగుతోంది.

అధిక మొత్తంలో నష్టాలు వాటిళ్లకుండా ముందస్తు చర్యగా జెట్​ షేర్ల ట్రేడింగ్​పై ఆంక్షలు విధించనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజిలు వెల్లడించాయి. జూన్ 28 నుంచి ఈ ఆంక్షలు అమలు కానున్నాయి.

ఇప్పటికే నిధుల కొరత కారణంగా సంస్థ కార్యకలాపాలు ఏప్రిల్ నుంచి తాత్కాలికంగా నిలిపివేసింది జెట్​.

ఇదీ చూడండి: అంతర్జాల వినియోగంలో రెండో స్థానం మనదే

ABOUT THE AUTHOR

...view details