అప్పుల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ యాజమాన్యాన్ని రుణదాతలు చేజిక్కుంచుకున్న తర్వాత మరో అడుగు ముందుకు పడింది. తాజాగా ఈ విమానయాన సంస్థ వాటా విక్రయానికి సిద్ధమైంది జెట్ రుణదాతల కన్సార్షియంకు నేతృత్వం వహిస్తున్న ఎస్బీఐ. ఈ బ్యాంకు ఛైర్మన్ రజినీశ్ కుమార్ అధ్యక్షతన గురువారం జరిగిన రుణదాతల సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు.
'జెట్' వాటాల విక్రయానికి సిద్ధమైన రుణదాతలు
అప్పుల ఊభిలో ఉన్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ వాటా విక్రయానికి సిద్ధమయ్యారు రుణదాతలు. ఎస్బీఐ నేతృత్వంలో జరిగిన రుణదాతల సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. జెట్ వాటా కొనుగోలుకు ఈ నెల 6 నుంచి బిడ్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
జెట్ ఏయిర్వేస్
ఏప్రిల్ 6 నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది ఎస్బీఐ. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 9ని చివరి రోజుగా నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ ప్రయత్నం ఆమోదయోగ్యమైన ఫలితాన్ని ఇవ్వకపోతే ఇతర మార్గాలను అన్వేషించనున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది.