తెలంగాణ

telangana

ETV Bharat / business

జెట్​ ఎయిర్​వేస్​కు మరోషాక్ ​- సీఈఓ రాజీనామా - Jet Airways

జెట్​ ఎయిర్​వేస్​ సీఈఓ (ముఖ్య కార్యనిర్వాహణాధికారి) వినయ్​ దూబె రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు జెట్​ యాజమాన్యం తెలిపింది.

జెట్​ ఎయిర్​వేస్​ సీఈఓ రాజీనామా

By

Published : May 14, 2019, 7:57 PM IST

Updated : May 14, 2019, 8:20 PM IST

జెట్​ ఎయిర్​వేస్​ సీఈఓ రాజీనామా

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసిన జెట్​ ఎయిర్​వేస్​ సంస్థకు మరో షాకిచ్చారు ఆ సంస్థ సీఈఓ (ముఖ్య కార్యనిర్వాహణాధికారి) వినయ్​ దూబె. బాధ్యతల నుంచి స్వతహాగా తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతోనే దూబె.. సీఈఓ పదవికి రాజీనామా చేశారని, తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని జెట్ ఎయిర్​వేస్ తెలిపింది.

నిధుల సేకరణ విషయమై గత నెలలో బ్యాంకర్లు, జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రతినిధుల మధ్య సుదీర్ఘ సమావేశాలు జరిగాయి. జెట్ సేవలు నిలిచిపోకుండా కొనసాగేందుకు రూ. 400 కోట్లు అత్యవసర రుణం కావాలని ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది. అయితే అప్పటి వరకు జెట్‌ యాజమాన్యాన్ని ఊరించిన రుణ దాతలు, బ్యాంకులు చివరి నిమిషంలో చేతులెత్తేశాయి. ఫలితంగా చేసేదేమీ లేక తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది జెట్​ ఎయిర్​వేస్​.

ఇదీ చూడండి : 115 మేకులు మింగిన 'ఉక్కు మనిషి'

Last Updated : May 14, 2019, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details