తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్విట్టర్ సీఈఓగా తప్పుకున్న డోర్సీ.. తదుపరి పగ్గాలు భారతీయుడికే

ట్విట్టర్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు జాక్ డోర్సీ ప్రకటించారు. పరాగ్ అగర్వాల్ తదుపరి సీఈఓగా (Twitter new CEO) బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు.

jack Dorsey steps down as Twitter CEO
jack Dorsey steps down as Twitter CEO

By

Published : Nov 29, 2021, 9:43 PM IST

Updated : Nov 29, 2021, 10:20 PM IST

ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ (Jack dorsey news) ఆ సంస్థ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో భారత సంతతి అమెరికన్ అయిన పరాగ్ అగర్వాల్ (Parag Agrawal Twitter CEO) సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని జాక్ డోర్సీ స్వయంగా ప్రకటించారు.

సీఈఓగా వైదొలగుతున్నట్టు (Twitter CEO steps down) సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖను డోర్సీ తన ట్విట్టర్ (Twitter latest news) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ నిర్ణయం పట్ల ఒకింత బాధగా ఉందని, మరోవైపు సంతోషంగానూ ఉందని చెప్పారు. సీఈఓగా వైదొలగాలని తీసుకున్న నిర్ణయం తనదేనని స్పష్టం చేశారు.

"16 ఏళ్లుగా సంస్థలో వివిధ హోదాల్లో పని చేశాను. బాధ్యతల నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. పరాగ్ నేటి నుంచి సంస్థకు సీఈఓగా ఉంటారు. సంస్థ తీసుకున్న అని నిర్ణయాల్లో పరాగ్ కీలకంగా వ్యవహరించారు. ట్విట్టర్​కు ఏం కావాలో ఆయనకు తెలుసు. (బోర్డు సభ్యుడిగా) పదవీ కాలం ముగిసిన తర్వాత బోర్డు నుంచి కూడా తప్పుకుంటాను. బోర్డులో ఎందుకు ఉండటం లేదని మీరు అడగొచ్చు. పరాగ్.. సంస్థను ముందుండి నడిపించే స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటున్నా. వ్యవస్థాపకుల మార్గనిర్దేశనం లేకుండానే ట్విట్టర్ నిలబడగలుగుతుందని నా ప్రగాఢ విశ్వాసం."

-జాక్ డోర్సీ, ట్విట్టర్ వ్యవస్థాపకుడు

తదుపరి సీఈఓగా పరాగ్​ను నియమించాలన్న నిర్ణయంతో పాటు బ్రెట్ టేలర్.. బోర్డులో భాగస్వామ్యం కావడానికి అంగీకరించడం, సంస్థకు ఉన్న సమర్థమైన టీమ్​ను దృష్టిలో ఉంచుకొని సీఈఓగా తప్పుకుంటున్నట్లు జాక్ డోర్సీ వెల్లడించారు. తన నిర్ణయం సరైనదేనని అన్నారు.

మరోవైపు, తనను సీఈఓగా ఎంపిక చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు పరాగ్ అగర్వాల్. డోర్సీ స్నేహానికి, ఆయన అందించిన మార్గనిర్దేశనానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఐఐటీలో చదివి..

పరాగ్ అగర్వాల్ ప్రస్తుతం ట్విట్టర్​లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్​గా పనిచేస్తున్నారు. 2011లో ట్విట్టర్​లో చేరిన ఆయన.. 2017 నుంచి సీటీఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఐఐటీ బాంబే, స్టాన్​ఫర్డ్ యూనివర్సిటీలలో చదువుకున్నారు.

ఇదీ చదవండి:'బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేది లేదు'

Last Updated : Nov 29, 2021, 10:20 PM IST

ABOUT THE AUTHOR

...view details