తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఐదేళ్లలోనే 8.73 లక్షల ఐటీ ఉద్యోగాల సృష్టి' - కేంద్ర ఐటీ మంత్రి

ఐటీ రంగంలో గత ఐదేళ్లలోనే  8.73 లక్షల ఉద్యోగాలు సృష్టించామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ​ఉద్యోగాల కల్పనపై కాంగ్రెస్​ అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు.

కేంద్ర ఐటీ మంత్రి

By

Published : Mar 21, 2019, 6:32 AM IST

Updated : Mar 21, 2019, 8:19 AM IST

గడచిన ఐదేళ్లలో సమాచార సాంకేతిక రంగంలో 8.73 లక్షల ఉద్యోగాలు సృష్టించామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్​ అన్నారు. దీనిపై కాంగ్రెస్​ అసత్య ఆరోపణలు చేస్తుందని ఆయన విమర్శించారు. నాస్కామ్​ గణాంకాల మేరకే ఈ లెక్కలున్నాయని స్పష్టం చేశారు.

''కాంగ్రెస్​ పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో చెప్పాలి. యూపీఏ హయాంలో భారత్​ అవినీతికి కేంద్ర బిందువుగా నిలిచింది. ఎన్నో అక్రమాలు జరిగాయి. ఆర్థిక వ్యవస్థ పతనమైంది. ప్రస్తుతం ఐటీ రంగంలో 41.40 లక్షల మందికి ప్రత్యక్షంగా, 1.2 కోట్ల మందికి పరోక్షంగా ఉపాది కల్పిస్తున్నాం''

- రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర ఐటీ మంత్రి

గత కొన్ని సంవత్సరాల్లో పెరిగిన ఆర్థిక కార్యకలాపాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల వృద్ధి.. ఉద్యోగాల కల్పనకు తోడ్పడినట్లు పేర్కొన్నారు.

Last Updated : Mar 21, 2019, 8:19 AM IST

ABOUT THE AUTHOR

...view details