2014 తర్వాత అతితక్కువ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) మార్కెట్లోకి వచ్చిన సంవత్సరం ఇదేనని గణాంకాలు చెబుతున్నాయి. మరోపక్క సూచీలు రికార్డు స్థాయిల వద్ద ట్రేడవుతున్నప్పటికీ ఈ పరిస్థితి నెలకొనడం ఆశ్చర్యకరం. మరెన్నో కంపెనీలు జీవితకాల అత్యధిక ధరల వద్ద ట్రేడవుతుండటం విశేషం.
నిజానికి ఈ ఏడాది చాలా కంపెనీలు సెబీ నుంచి అనుమతులు తెచ్చుకున్నా మార్కెట్లలోకి రాలేదు. ఇంకా చెప్పాలంటే.. సెబీ అనుమతులు ఇచ్చిన వాటిల్లో 47 కంపెనీలు మార్కెట్లోకి రాలేదు. దీంతో రూ.51,000 కోట్లు విలువైన ఐపీవోల అనుమతులు నిరుపయోగంగా మారాయి. చిన్న, మధ్యశ్రేణి కంపెనీలు నిధుల సమీకరణ మందకొడిగా ఉండటం కారణంగా భయపడ్డాయి. ఈ సారి నిరుపయోగంగా మారిన అనుమతుల్లో ఎస్‌ఎంఈ ఐపీఓలు రూ.12,982 మాత్రమే సేకరించాయి. గత ఏడాది ఈ మొత్తం రూ.33,246 కోట్లు వసూలు చేశాయి. అదే 2014లో ఈ మొత్తం రూ.1,468 కోట్లుగా ఉన్నాయి.