యాప్టస్ వ్యాల్యూ హౌసింగ్ ఫినాన్స్, కార్‌ట్రేడ్, సుప్రియా లైఫ్‌సైన్స్, కృష్ణ డయాగ్నోస్టిక్స్, విజయా డయాగ్నోస్టిక్స్, యామీ ఆర్గానిక్స్ కంపెనీల పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనలకు సెబీ ఆమోద ముద్ర వేసింది.
కార్‌ట్రేడ్
పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారానే షేర్లు విక్రయించనుంది. కార్ట్రేడ్లో ప్రస్తుతం 11.93 శాతం వాటా ఉన్న సీబీడీబీ-2.. 16.07 లక్షల షేర్లను, 34.44 శాతం వాటా ఉన్న హైడెల్ ఇన్వెస్ట్మెంట్ 53.79 లక్షల షేర్లను, 26.48 శాతం వాటా ఉన్న మ్యాక్రిచే ఇన్వెస్ట్మెంట్ 35.68 లక్షల షేర్లను, 7.04 శాతం వాటా ఉన్న స్ర్పింగ్‌ఫీల్డ్ వెంచర్ ఇంటర్నేషనల్ 11.24 లక్షల షేర్లను విక్రయించనున్నాయి.
యాప్టస్ వ్యాల్యూ హౌసింగ్ ఫినాన్స్
రు.500 కోట్ల విలువైన కొత్త షేర్లతో పాటు.. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లకు చెందిన 6,45,90,695 షేర్లను ఆఫర్ ఫర్ సేల్‌లో జారీ చేయనుంది. ఈ ఐపీఓ ద్వారా లభించే రూ.2,600- రూ.3,000 కోట్లను భవిష్యత్ వృద్ధి అవసరాల కోసం, మూలధనాన్ని పెంచుకునేందుకు ఉపయోగించుకోనుంది.
సుప్రియా లైఫ్‌సైన్స్
రూ.200 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ప్రమోటర్ సతీశ్ వామన్ వాఘ్ రూ.1000 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్‌లో విక్రయించనున్నారు. సమీకరించే నిధులను మూలధన వ్యయాలు, రుణాల చెల్లింపునకు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోనుంది కంపెనీ.