ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) పెద్ద సంఖ్యలో నియామకాలు చేపడుతోంది. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.
మొత్తం 513 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది ఐఓసీఎల్. అర్హులైన వారు.. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.
పోస్టుల వివరాలు..
- జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ - 479
- జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ - 29
- జూనియర్ మెటీరియల్ అసిస్టెంట్/టెక్నికల్ అసిస్టెంట్- 04
- జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్ - 01
అర్హతలు..
- 2021 నాటికి 18 ఏళ్లు నిండి.. 26 ఏళ్లు దాటకుండా ఉండాలి. నాన్ క్రీమీలేయర్, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వరకు.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగార్థులకు 5 ఏళ్ల వరకు సడలింపు.
- ఉద్యోగార్హతను బట్టి నెలకు రూ.25,000 నుంచి రూ.1,05,000 వరకు వేతనం.
- పోస్టులకు సంబంధించిన సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.