తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒక్క రోజులో రూ.2.22 లక్షల కోట్లు ఆవిరి

ఆర్బీఐ రెపో రేట్ల కోతతో స్టాక్​ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను నమోదు చేశాయి. ఫలితంగా.. ఒక్క సెషన్​లోనే మదుపరులు రూ.2.22 లక్షల కోట్లు కోల్పోయారు.

సంపద ఆవిరి

By

Published : Jun 7, 2019, 6:16 AM IST

Updated : Jun 7, 2019, 9:08 AM IST

స్టాక్​ మార్కెట్లు గురువారం సెషన్​లో నమోదుచేసిన భారీ నష్టాల కారణంగా మదుపరుల సంపద ఒక్క రోజులోనే రూ. 2,22,304.65 కోట్లు ఆవిరైంది.

అంచనా వేసినట్టుగానే రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు మేర తగ్గిస్తూ ఆర్బీఐ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభావంతో బ్యాంకింగ్​ రంగ షేర్లు కుదేలయ్యాయి.

వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ బ్యాంకింగేతర ఆర్థిక రంగ సంక్షోభంపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ప్రభావం కూడా మార్కెట్లపై పడింది.

సూచీల కదలిక ఇలా...

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్​ 554 పాయింట్లు నష్టపోయి.. 40 వేల రికార్డు స్థాయిని కోల్పోయింది. చివరకు 39,530 పాయింట్ల వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 177 పాయింట్ల నష్టానికి చేరి 11,844 పాయింట్ల వద్ద సెషన్ ముగించింది.

ఇదీ చూడండి: రుణం మరింత తేలిక- 9 ఏళ్ల కనిష్ఠానికి వడ్డీరేట్లు

Last Updated : Jun 7, 2019, 9:08 AM IST

ABOUT THE AUTHOR

...view details