తెలంగాణ

telangana

ETV Bharat / business

మూడు లాభాలు... రూ.7.48 లక్షల కోట్లు - ఎన్డీఏ

ఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో మార్కెట్లు రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి. నేటి ఇంట్రాడేలో బీఎస్​ఈ లిస్టెడ్ కంపెనీల సంపద రూ. 5.33 లక్షల కోట్లు పెరిగింది. గత 3 సెషన్లలో ఆ విలువ రూ.7.48 లక్షల కోట్లు.

మదుపరుల సంపద

By

Published : May 20, 2019, 5:23 PM IST

Updated : May 20, 2019, 6:42 PM IST

ఎన్టీఏ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఇస్తూ ఎగ్జిట్ పోల్స్ వెలువడిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాలు నమోదు చేశాయి. 2009 మే 18న వచ్చిన 2,110 పాయింట్ల లాభాల తర్వాత మళ్లీ ఆ స్థాయి లాభాలు రావడం ఇదే ప్రథమం.

5 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద

నేటి భారీ లాభాల కారణంగా బీఎస్​ఈ లిస్టెడ్ కంపెనీల్లో మదుపరుల సంపద రూ. 5,33,463.04 కోట్లు పెరిగింది. ఈ వృద్ధితో పూర్తి సంపద రూ.1,51,86,312.05 కోట్లకు చేరింది.

మూడు సెషన్లలో రూ.7 లక్షల కోట్లు

రెండు వారాలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న మార్కెట్లు గత మూడు సెషన్లలో లాభాలు నమోదు చేశాయి. ఈ మూడు సెషన్లలో మదుపరుల సంపద రూ.7.48 లక్షల కోట్లు పెరిగింది.

Last Updated : May 20, 2019, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details