స్టాక్ మార్కెట్ల రికార్డు స్థాయి లాభాలతో దేశీయ మదుపరుల సంపద వరుసగా రెండో సెషన్లోనూ భారీగా పెరుగుతోంది. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద నేటితో కలిపి రెండు సెషన్లలో రూ.10,53,495.23 కోట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం మదుపరుల పూర్తి సంపద రూ.1,49,05,246.57 కోట్లకు చేరింది.
రెండు రోజుల్లో రూ.10.50 లక్షల కోట్ల సంపద వృద్ధి! - జీఎస్టీ
స్టాక్ మార్కెట్లో మదుపరుల సంపదకు రెక్కలొచ్చాయి. కేంద్రం ప్రకటించిన ఉద్దీపనల నేపథ్యంలో వచ్చిన భారీ లాభాలతో... నేటితో కలిపి రెండు సెషన్లలో మదుపరుల సంపద రూ.10.50 లక్షల కోట్లు పెరిగింది.
రెండు రోజుల్లో రూ.10.50 లక్షల కోట్ల సంపద వృద్ధి!
వృద్ధికి ఊతమందించే దిశగా.. కార్పొరేట్ సుంకాన్ని 30 నుంచి 22 శాతానికి తగ్గిస్తూ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటనతో గత రెండు సెషన్ల నుంచి స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు నమోదు చేస్తున్నాయి.
ఇదీ చూడండి: ఐటీ శాఖ నుంచి మెయిల్ వచ్చిందా? అయితే జాగ్రత్త!
Last Updated : Oct 1, 2019, 4:36 PM IST