దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. కాలిఫోర్నియా ప్రభుత్వానికి 8లక్షల డాలర్లు(రూ.5.6 కోట్లు) అపరాధ రుసుము చెల్లించేందుకు సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ ఉద్యోగులతో పని చేయించుకోవడం, పన్ను చెల్లింపుల్లో మోసం వంటి ఆరోపణలతో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇన్ఫీ ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు తెలిసింది.
అసలు విషయం ఇది...
ఇన్ఫోసిస్‌కు చెందిన దాదాపు 500 మంది ఉద్యోగులను హెచ్1-బీ (ఉద్యోగ వీసా) వీసాకు బదులు.. బీ-1(బిజినెస్ వీసా) వీసాతో కాలిఫోర్నియా రాష్ట్రంలో పని చేయించుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ ఉల్లంఘనతో కాలిఫోర్నియా ప్రభుత్వానికి చెల్లించాల్సిన వేర్వేరు పన్నులను ఇన్ఫీ ఎగ్గొట్టినట్లు అభియోగాలు ఉన్నాయి.