తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా భయాల్లోనూ ఇన్ఫీ జోరు- క్యూ1 లాభం ఎంతంటే? - infosys news

జూన్​తో ముగిసిన మొదటి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ. 4,272 కోట్ల నికర లాభాన్ని గడించింది. గతేడాదితో పోలిస్తే 12.4 శాతం అధికంగా లాభం ఆర్జించింది. సంస్థ ఆదాయం సైతం 8.5 శాతం పెరిగినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది.

Infosys Q1 net profit up 12.4 pc to Rs 4,272 cr
కరోనాలోనూ ఇన్ఫీ జోరు- క్యూ1 లాభం ఎంతంటే?

By

Published : Jul 15, 2020, 8:38 PM IST

కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన జోరు చూపించింది.​ జూన్​తో ముగిసిన మొదటి త్రైమాసికంలో రూ. 4,272 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంతో(రూ.3,802 కోట్లు) పోలిస్తే నికర లాభం 12.4 శాతం పెరిగినట్లు సంస్థ వెల్లడించింది.

"తొలి త్రైమాసికంలో మా ప్రదర్శన, భారీ ఒప్పందాల వల్ల మిగిలిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ పనితీరు మెరుగుపడుతుందనే మా విశ్వాసం పెరుగుతోంది."

-సలీల్ పరేఖ్, ఇన్ఫోసిస్ సీఈఓ

క్యూ1లో ఆదాయం 8.5 శాతం పెరిగి రూ.23,665కి చేరినట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో రూ. 21,803 కోట్ల ఆదాయాన్ని గడించినట్లు తెలిపింది. ఆదాయాలు 1.5 శాతం పెరిగినట్లు తెలిపింది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో స్థిర కరెన్సీ వద్ద సంస్థ ఆదాయం రెండు శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ అంచనా వేసింది.

ఇదీ చదవండి-మహారాష్ట్రలో మరో 7,975 కేసులు.. 233 మరణాలు

ABOUT THE AUTHOR

...view details