స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు నేడు అడ్డుకట్టపడింది. ఇన్ఫోసిస్ సీఈఓ, సీఎఫ్లపై అవినీతి ఆరోపణల కారణంగా ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి సూచీలు. ఆర్థిక రంగ షేర్లు కాస్త సానుకూలంగా ఉన్నా... ఐటీ, వాహన షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 334 పాయింట్లు కోల్పోయింది. చివరకు 38,964 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 72 పాయింట్లు క్షీణించి..11,590 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 39,426 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 38,925 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,714 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,574 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.