తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.8 వేల కోట్లతో.. 11కోట్ల షేర్లు కొనేసిన ఇన్ఫీ - 8 వేల కోట్లు

ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన బై బ్యాక్​ ఆఫర్​ ముగిసినట్లు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తెలిపింది. ఆగస్టు 26తో ముగిసిన ఈ ఆఫర్​ ద్వారా మొత్తం 11 కోట్లకు పైగా షేర్లు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఒక్కో షేర్​కు రూ.747 వెచ్చించినట్లు తెలిపింది.

ఇన్ఫోసిస్​

By

Published : Aug 27, 2019, 1:22 PM IST

Updated : Sep 28, 2019, 11:14 AM IST

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​ రూ.8,260 కోట్లతో చేపట్టిన భారీ బై బ్యాక్ ముగిసింది. ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన బై బ్యాక్​ ద్వారా ఆగస్టు 26 వరకు మొత్తం 11.05 కోట్ల షేర్లను కొనుగోలు చేసినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.

బై బ్యాక్ పూర్తి వివరాలు..

  • 20 మార్చి 2019 బై బ్యాక్​ ప్రారంభం
  • 26 ఆగస్టు 2019 బై బ్యాక్​ ముగింపు
  • కొనుగోలు చేసిన మొత్తం షేర్లు 11,05,19,266
  • ఒక్కో ఈక్విటీ షేర్​కు వెచ్చించిన మొత్తం రూ.747.38
  • బైబ్యాక్​కు అయిన మొత్తం ఖర్చు రూ.82,59,99,99,430.03

ఇదీ చూడండి: విమానాల్లో ఈ 'యాపిల్'​ ల్యాప్​​టాప్​లపై ​నిషేధం

Last Updated : Sep 28, 2019, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details